- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బుల కోసమే మనవడు హత్య
అప్యాయంగా పెంచుకొని, అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చిన సొంత అమ్మమ్మనే మనవడు హత్య చేసిన ఘటన మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించింది.

దిశ, రామాయంపేట : అప్యాయంగా పెంచుకొని, అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చిన సొంత అమ్మమ్మనే మనవడు హత్య చేసిన ఘటన మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించింది. సీఐ సైదానాయక్ తెలిపిన వివరాల ప్రకారం రామాయంపేట మున్సిపాలిటీ పరిధి పదో వార్డులో నివాసముండే దోమకొండ సాయమ్మ (60) అనే వృద్ధురాలు ఈ నెల 18వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గుండెపోటుగా అనుమానించిన బంధువులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇదే క్రమంలో మృతదేహం మెడ భాగంలో ఘాట్లు ఉండగా బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. మూడు రోజుల ప్రక్రియ పూర్తి చేస్తున్న క్రమంలో ఆమె ఒంటిపై బంగారం కనిపించకపోవడం, బీరువాలో వెతికిన బంగారం లేకపోవడంతో అనుమానం వ్యక్తం అయింది. ఇదే క్రమంలో సాయమ్మ చిన్న కూతురు కుమారుడు విశాల్ ఈ నెల 17న రాత్రి తన అమ్మమ్మ దగ్గరకు వచ్చినట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. దీంతో మనువడు విశాల్ ను కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. విశాల్ ఎప్పటి మాదిరిగా అమ్మమ్మ దగ్గరికి వచ్చి డబ్బులు అడిగాడు ఆమె తన వద్ద ఉన్న రూ.7 వేలు ఇచ్చి,తన దగ్గర అంతకుమించి డబ్బు లేదని చెప్పింది. అయితే తనకు ద్విచక్ర వాహనం కొనుగోలు చేయడానికి డబ్బులు కావాలని విశాల్ ఒత్తిడి చేశాడు. ఆమె అందుకు అంగీకరించక పోవడంతో తన స్నేహితుడు ప్రశాంత్ తో కలిసి కల్లులో మత్తు మాత్రలు ఇచ్చి తాగించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అనంతరం ఒంటిపై ఉన్న బంగారు కమ్మలతో పాటు, బీరువాలో ఉన్న డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారు. మత్తులో నుంచి బయటకు వచ్చిన సాయమ్మ అరవడంతో విశాల్ ఆమె గొంతు నులుమగా అతని స్నేహితుడు కాళ్లు పట్టుకున్నాడు.ఆమె చనిపోయిందని నిర్ధారించుకొని బంగారం తీసుకొని పరారయ్యారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనుమడు విశాల్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. కేసులో విశాల్ తో పాటు అతని స్నేహితుడు ప్రశాంత్ను అరెస్టు చేసి వారి నుండి బంగారు నగలు , ఫోన్ , ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు సీఐ సైదా నాయక్ తెలిపారు.






