- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసు శాఖ ప్రతిష్ట పెంచేలా ప్రతి అధికారి పనిచేయాలి
జాసేవే పరమావధిగా భావించి పోలీసు శాఖ ప్రతిష్టను పెంపొందించే విధంగా ప్రతి పోలీసు అధికారి విధులు నిర్వహించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా సూచించారు.

దిశ, తాండూర్ రూరల్: ప్రజాసేవే పరమావధిగా భావించి పోలీసు శాఖ ప్రతిష్టను పెంపొందించే విధంగా ప్రతి పోలీసు అధికారి విధులు నిర్వహించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా సూచించారు. మంగళవారం వార్షిక తనిఖీలలో భాగంగా తాండూర్ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం, తాండూర్ రూరల్ సర్కిల్ కార్యాలయాలను ఆమె సందర్శించారు. ముందుగా డీఎస్పీ కార్యాలయ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎస్పీ, అనంతరం రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి పరిశుభ్రత, నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ రికార్డులు, కేసు ఫైళ్లు, పరిపాలనా పత్రాలు, స్టేషన్ వారీ రిజిస్టర్లు, అధికారిక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించి, దర్యాప్తులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రికార్డులను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. పోలీసు శాఖ ప్రతిష్టను పెంపొందించే విధంగా వృత్తి నైపుణ్యం, క్రమశిక్షణ, ప్రజాసేవా దృక్పథంతో విధులు నిర్వహించాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడానికి అమలు చేస్తున్న విలేజ్ పోలీస్ ఆఫీసర్ (వీపీఓ) వ్యవస్థను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో సమాచార సేకరణ, నేర నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారం, పోలీసు-ప్రజల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో వీపీఓ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా సురక్ష మిత్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళలు, చిన్నారుల రక్షణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత వంటి అంశాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తనిఖీ సందర్భంగా సిబ్బంది టర్నౌట్‌ను కూడా పరిశీలించిన ఎస్పీ, అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో, చక్కటి టర్నౌట్‌తో విధులు నిర్వహిస్తున్నందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, తాండూర్ రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






