కాబోయే భర్తను చంపి సోషల్ మీడియాలో డ్రామాలు.. వైరల్ అవుతున్న సియా గోయల్ వీడియో

by Ajay Maddhiboyina |

పూణెలోని లోహ‌గ‌డ్ కోట వ‌ద్ద 25ఏళ్ల కేత‌న్ విశాల్ అనే యువ‌కుడిని కాబోయే భార్య సియా గోయ‌ల్ హ‌త్య చేయ‌డం సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. మొద‌ట కాలుజారి కింద‌ప‌డ్డాడ‌ని న‌మ్మించగా పోలీసుల‌కు అనుమానం రావ‌డంతో విచార‌ణ‌లో సంచ‌ల‌న నిజాలు వెలుగు చూశాయి.

కాబోయే భర్తను చంపి సోషల్ మీడియాలో డ్రామాలు.. వైరల్ అవుతున్న సియా గోయల్ వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: పూణెలోని లోహ‌గ‌డ్ కోట వ‌ద్ద 25ఏళ్ల కేత‌న్ విశాల్ అనే యువ‌కుడిని కాబోయే భార్య సియా గోయ‌ల్ హ‌త్య చేయ‌డం సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. మొద‌ట కాలుజారి కింద‌ప‌డ్డాడ‌ని న‌మ్మించగా పోలీసుల‌కు అనుమానం రావ‌డంతో విచార‌ణ‌లో సంచ‌ల‌న నిజాలు వెలుగు చూశాయి. పెళ్లి ఇష్టంలేక త‌న ప్రియుడు చేత‌న్ చౌద‌రితో క‌లిసి సియా కాబేయే భ‌ర్త కేత‌న్ ను లోయ‌లోకి తోసేసింది. దీంతో అక్క‌డికక్క‌డే కేత‌న్ ప్రాణాలు కోల్పోయాడు. ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపిన పోలీసులు సియా ఫోన్ కాల్స్ ఆధారంగా ఇది హ‌త్యేన‌ని నిర్దారించి ఆమెతో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.

అయితే కేత‌న్ ను చంపిన త‌ర‌వాత ఎవ‌రికీ అనుమానం రాకుండా సియా సోష‌ల్ మీడియాలో మొస‌లి క‌న్నీరు కార్చ‌డం అందరినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. త‌న పుట్టిన రోజు కోసం సియా చేత‌న్‌ను లోహ‌గ‌డ్ కోట వ‌ద్ద‌కు తీసుకువెళ్లగా అక్కడ వాళ్లిద్దరూ సరదాగా గడిపిన వీడియోలను సియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. త‌న పోస్టులో ఎంతో ఆవేద‌న చెందుతున్న‌ట్టు రాసుకొచ్చింది.

నా పుట్టిన‌రోజునే నువ్వు దూరం అవ్వ‌డం, మ‌న పెళ్లికి ద‌గ్గ‌ర‌పడుతుంటే నువ్వు దూరం అవ్వ‌డం, నువ్వు ఎందుకు ఇలా చేశావో నాకు అర్థం కావ‌డంలేదు. నేను నీతో జీవితం కోసం ఎన్నో క‌ల‌లు క‌న్నాను. నేను నిన్ను ఎంత‌గానో ప్రేమిస్తుంటే నువ్వు న‌న్ను ఎలా విడిచిపెట్టి వెళ్లావు.. అంటూ రాసుకొచ్చింది. అయితే తానే చంపి ఎవ‌రికీ అనుమానం రాకుండా సియా చేసిన పోస్టులు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. దీంతో నెటిజ‌న్లు ఆమెపై మండిప‌డుతున్నారు.

Next Story