మెదక్ ఫాల్కన్స్ జట్టుకు ఎంపికైన క్రికెటర్‌ కుంట రాహుల్

by velandi.Saikiran |

బండలింగంపల్లి గ్రామానికి చెందిన క్రికెటర్‌ కుంట రాహుల్ మెదక్ ఫాల్కన్స్ జట్టుకు ఎంపికయ్యారు.

మెదక్ ఫాల్కన్స్ జట్టుకు ఎంపికైన క్రికెటర్‌ కుంట రాహుల్
X

దిశ, ఎల్లారెడ్డిపేట: TGPL వేలంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన క్రికెటర్‌ కుంట రాహుల్ మెదక్ ఫాల్కన్స్ జట్టుకు ఎంపికయ్యారు. హెచ్ సిఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రీమియర్ లీగ్ వేలంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది క్రికెటర్లు పాల్గొనగా, వారిలో 160 మందిని 8 జట్లకు ఎంపిక చేశారు. అందులో బండలింగంపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది కుంట శ్రీనివాస్ పద్మ దంపతుల కుమారుడు కుంట రాహుల్ ఎంపికయ్యారు. రాహుల్ ను TGPL వేలంలో రూ.75,000కు మెదక్ ఫాల్కన్స్ జట్టు ఎంపిక చేసుకుంది. ఈ సందర్భంగా జిల్లాలోని క్రీడాభిమానులు, యువ క్రికెటర్లు ఆనందం వ్యక్తం చేస్తూ రాహుల్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. రాహుల్ ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు.

Next Story