- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఎంసీలో ముదిరిన సంక్షోభం.. 7 గురు రెబల్ ఎమ్మెల్యేలపై మమతా బెనర్జీ వేటు
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని అధ్యక్షురాలి పదవి నుంచి తొలగిస్తున్నట్లు రెబల్ వర్గం ప్రకటించిన మరుసటి రోజే, ఆమె తిరుగుబాటు నేతలపై సస్పెన్షన్ వేటు వేయడం సంచలనం సృష్టిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని అధ్యక్షురాలి పదవి నుంచి తొలగిస్తున్నట్లు రెబల్ వర్గం ప్రకటించిన మరుసటి రోజే, ఆమె తిరుగుబాటు నేతలపై సస్పెన్షన్ వేటు వేయడం సంచలనం సృష్టిస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి, తన మాజీ సన్నిహితుడు ఫిర్హాద్ హకీమ్ సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించారు.
బహిష్కరణకు గురైన నేతలు వీరే..
రెబల్ ఎమ్మెల్యేలు ఫిర్హాద్ హకీమ్, జావేద్ అహ్మద్ ఖాన్, అరూప్ రాయ్, రథిన్ ఘోష్, బిప్లబ్ మిత్ర, సబీనా యాస్మిన్, స్నేహాశిష్ చక్రవర్తి, మాజీ మంత్రి అరూప్ బిశ్వాస్‌లను బహిష్కరించారు.
చీలిక దిశగా టీఎంసీ
అంతకుముందు రోజు ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం ఏకగ్రీవంగా మమతా బెనర్జీ స్థానంలో సీనియర్ నేత అరూప్ రాయ్‌ను టీఎంసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఫిర్హాద్ హకీమ్, అరూప్ బిశ్వాస్‌లను ఉపాధ్యక్షులుగా నియమిస్తూ 30 మంది సభ్యులతో కొత్త జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. 1998లో పార్టీని స్థాపించి ఇప్పటివరకు అధినేత్రిగా ఉన్న మమతా బెనర్జీ, ఇకపై పార్టీకి కేవలం ‘మెంటార్’ (మార్గదర్శి)గా మాత్రమే వ్యవహరించాలని రెబల్ వర్గం కోరింది. మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేల్లో 60 మంది మద్దతు తమకే ఉందని రెబల్స్ ప్రకటించారు.
ఇప్పటికే 28 మంది టీఎంసీ లోక్‌సభ ఎంపీల్లో 20 మంది పార్టీని వీడి ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’లో విలీనమయ్యారు. ఒకప్పటి మమతా బెనర్జీ అత్యంత సన్నిహితులు, ముఖ్య నేతలే ఇప్పుడు ఆమెపై తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఈ పరిణామాలు తీవ్ర సంచలనంగా మారాయి.






