‘ఇక మిగిలింది కమ్యూనిస్టు పార్టీనే’: కూన శ్రీశైలం గౌడ్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందపై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘ఇక మిగిలింది కమ్యూనిస్టు పార్టీనే’: కూన శ్రీశైలం గౌడ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందపై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే వివేకానంద ఇంకోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కుత్బుల్లాపూర్‌లో తిరగనీయం. బీఆర్ఎస్‌లో గెలిచి ఆ పార్టీని బేరం పెట్టిండు. ఎమ్మెల్యే వివేకానంద ఎన్ని పార్టీలు మారిండో ఆయన గుర్తుచేసుకోవాలి. కమ్యూనిస్టు పార్టీ తప్ప అన్ని పార్టీలు మారిండు. టీడీపీలో చేరి ఆ పార్టీని నిండా ముంచిండు. వివేకానంద దొంగ చాటున గెలిచిన దొంగ ఎమ్మెల్యే. మూడుసార్లు గెలిచినా కుత్బుల్లాపూర్‌కు చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ హయాంలో వేలాది ఇండ్లు ఇచ్చింది. కుత్బుల్లాపూర్‌లో ప్రభుత్వ భూములన్నీ కేటీఆర్, హరీష్ రావులకు అమ్మించిన ఘనత వివేకానందది. మైనంపల్లి హనుమంత రావు గురించి మాట్లాడే స్థాయి వివేకానందకు లేదు’ కూన శ్రీశైలం గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story