- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీటీఓ మృతిపై సీఎం దిగ్భ్రాంతి.. వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశం
భూపాలపల్లిలో విధి నిర్వహణలో ఉన్న డీటీఓ ఎం. వెంకన్న మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలంగాణ సీఎంఓ ప్రకటన విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: భూపాలపల్లిలో విధి నిర్వహణలో ఉన్న డీటీఓ ఎం. వెంకన్న మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలంగాణ సీఎంఓ ప్రకటన విడుదల చేసింది. వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. అలాగే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. వెంటనే నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రవాణాశాఖ జాయింట్ కమిషనర్ ను ఆదేశించారు. వెంకన్న కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులో సోమవారం ఉదయం.. డీటీఓ వెంకన్న వాహనాలను తనిఖీ చేస్తుండగా.. బొగ్గులోడుతో వెళ్తున్న లారీ ఆయన పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వెంకన్న తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదవశాత్తు లారీ దూసుకొచ్చిందా? లేక ఏదైనా కుట్ర ఉందా? అన్నకోణంలో విచారణ చేస్తున్నారు.






