- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. రాబోయే 2 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
నిర్మల్, నిజామాబాద్, నల్గొండ సహా పలు జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో తీవ్ర ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. రాత్రి 7 తర్వాత హైదరాబాద్‌లో వానలు!

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజలకు వెదర్ మ్యాన్ కీలక అలర్ట్ జారీ చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఇచ్చిన తాజా అలర్ట్‌లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. రాబోయే రెండు గంటల వ్యవధిలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యంత తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
ఈ రోజు రాత్రి హైదరాబాద్‌కు వాన గండం
వెదర్ మ్యాన్ అలర్ట్ ప్రకారం.. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులు క్రమంగా పుంజుకోనున్నాయి. ఇక భాగ్యనగర విషయానికి వస్తే.. ఈరోజు (సోమవారం) రాత్రి 7 గంటల వరకు నగరం అంతటా పొడి వాతావరణమే (Dry Weather) కొనసాగే అవకాశం ఉంది. అయితే, రాత్రి 7 గంటల తర్వాత నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి.. హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు వచ్చేటప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని అధికారులు సూచించారు.






