తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా అప్‌గ్రేడ్‌కు బాన్సువాడ ప్రభుత్వ విద్యాసంస్థల పరిశీలన

by Ratna Kumari |

ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాన్సువాడలను తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)గా అప్‌గ్రేడ్ చేయడంలో భాగంగా రాష్ట్ర స్థాయి కమిటీ సోమవారం పాఠశాలలను సందర్శించి భౌతిక వసతులు, విద్యా ప్రమాణాలను పరిశీలించింది.

తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా అప్‌గ్రేడ్‌కు బాన్సువాడ ప్రభుత్వ విద్యాసంస్థల పరిశీలన
X

దిశ, బాన్సువాడ: ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాన్సువాడలను తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)గా అప్‌గ్రేడ్ చేయడంలో భాగంగా రాష్ట్ర స్థాయి కమిటీ సోమవారం పాఠశాలలను సందర్శించి భౌతిక వసతులు, విద్యా ప్రమాణాలను పరిశీలించింది. టీపీఎస్ రాష్ట్ర స్థాయి పరిశీలకుడు శ్రీనివాస చారి నేతృత్వంలోని కమిటీ పాఠశాలలోని తరగతి గదులు, ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, క్రీడా మైదానం, మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం, డిజిటల్ తరగతి గదులను క్షుణ్ణంగా పరిశీలించింది. అలాగే విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల హాజరు, విద్యా ఫలితాలు, పాఠ్యేతర కార్యకలాపాలపై వివరాలను సేకరించింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మండల విద్యాశాఖాధికారి పి.నాగేశ్వరావు, ఏఈలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరహరి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాలలో ఉన్న వసతులను టీపీఎస్ ప్రమాణాలకు అనుగుణంగా మరింత అభివృద్ధి చేసేందుకు కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల టీపీఎస్‌గా అప్‌గ్రేడ్ అయితే బాన్సువాడ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తాయని మండల విద్యాశాఖాధికారి తెలిపారు. కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Next Story