- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెకీ రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామం
టెకీ రాధాగాయత్రి అనుమానాస్పద మృతికేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: టెకీ రాధాగాయత్రి అనుమానాస్పద మృతికేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన కూతురి మరణానికి అల్లుడే కారణమై ఉంటాడని తన అనుమానాలన్నింటినీ ఉత్తరాఖండ్ డీజీపీ దీపమ్ సేథ్ కు రాధ తండ్రి సుధాకర్ వివరించారు. అలాగే ముస్సోరీ పోలీసుల తీరు ఏం బాలేదని కంప్లైంటే చేశారు. దీంతో ముస్సోరీ ఎస్ హెచ్ఓ దేవేంద్ర చౌహాన్ ప్రవర్తనపై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు విచారణ అధికారిని మారుస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. రాధాగాయత్రి మృతికేసు విచారణ బాధ్యతను సంపూర్ణానంద్ గైరోలాకు అప్పగించారు. ఇప్పటికే రాధ భర్త శ్రీచరణ్ పై హత్యాయత్నం కేసు నమోదవ్వగా.. తాజాగా కేసు టేకప్ చేసిన సంపూర్ణానంద్ అతడిని త్వరలోనే విచారించనున్నారు.
ఇదిలా ఉండగా.. శ్రీచరణ్ పదే పదే.. తన భార్య ఎలా చనిపోయిందో తనకు తెలీదంటున్నాడు. ఆకస్మికంగా నోటివెంట రక్తంవచ్చి చనిపోతే పోస్టుమార్టమ్ రిపోర్టులో ఏం చెప్పారన్న దానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. రెడ్ వైన్ తాగాక ఇదంతా జరిగితే.. అదే వైన్ శ్రీచరణ్ కూడా తాగినపుడు ఎందుకు ఏమీ జరగలేదని నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. రాధాగాయత్రిని ఆమె భర్తే ఏదో చేశాడని సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై కామెంట్ల వర్షం కురుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారింది.






