క్లాసీ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తున్న అనన్య పాండే

by Pulgam srinivas |

క్లాస్ లుక్‌తో కట్టిపడేస్తున్న అనన్య పాండే

క్లాసీ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తున్న అనన్య పాండే
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్‌లో అత్యంత గ్లామరస్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు హిందీ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ భామ, ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.




కొంతకాలం క్రితం విజయ్ దేవరకొండ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ చిత్రంలో అనన్య హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తెలుగులో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.




ఆ తర్వాత టాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు పెద్దగా దక్కలేదు. అయితే బాలీవుడ్‌లో మాత్రం అనన్య తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది.




సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తరచూ తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. తాజాగా అనన్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని స్టన్నింగ్ ఫోటోలను షేర్ చేసింది.




క్లాసీ లుక్‌లో స్లీవ్‌లెస్ డ్రెస్ ధరించి మెరిసిపోయిన ఆమె, అందుకు తగినట్లుగా స్టైలిష్ నెక్‌పీస్, ఇయర్‌రింగ్స్, చేతికి బ్రేస్‌లెట్, వేళ్లకు ఉంగరాలతో మరింత ఆకర్షణీయంగా కనిపించింది. మొత్తంగా ఈ అవుట్‌ఫిట్‌లో అనన్య అందాలు అభిమానులను ఫిదా చేయగా, ప్రస్తుతం ఆమె తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story