బడి పిల్లలకు బస్సు కష్టాలు.. 90 మందికి ఒకే బస్సు

by Kodari Anjali |

బడి పిల్లలకు బస్సు క ష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

బడి పిల్లలకు బస్సు కష్టాలు.. 90 మందికి ఒకే బస్సు
X

దిశ, రేగోడ్: బడి పిల్లలకు బస్సు క ష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మండల కేంద్రమైన రేగోడ్‌లోని మాడల్, ఉన్నత పాఠశాలలకు కొండాపూర్, జగిర్యాల, ఆర్.ఇటిక్యాల గ్రామాల నుండి 90 మంది వరకు బాల బాలికలు చదువుకునేందుకు నిత్యం వస్తుంటారు. అదే విధంగా ఉపాధ్యాయ సిబ్బంది కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి వస్తారు. సంగారెడ్డి డిపోకు చెందిన బస్సులో రేగోడ్‌కు వచ్చే విద్యార్థులు,టీచర్లు నానా తిప్పలు పడుతున్నారు. ఉదయం పాఠశాలల సమయంలో ఒకే బస్సు ఉండడంతో మాములుగా ప్రయాణించే వారితో పాటు 90 మంది విద్యార్థులు బస్సులో తంటాలు పడుతూ ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారు. దగ్గరలోని నారాయణఖేడ్ డిపో నుండి పాఠశాల సమయంలో ఒక షటల్ బస్సు సర్వీస్ నడిపించాలని కొండాపూర్ సర్పంచ్ పండరి ప్రజావాణిలో వినతిని అందజేశారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సు సౌకర్యాన్ని విద్యార్థుల కోసం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Next Story