- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. స్కూలు భవనంపై నుంచి పడి విద్యార్థి మృతి
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొవ్వూరు మండలం కాపవరంలో తిరుమల స్కూలు భవనంపై నుంచి విద్యార్థి కిందపడి మృతి చెందారు...

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District)లో విషాదం చోటు చేసుకుంది. కొవ్వూరు మండలం(Kovvuru Mandal) కాపవరం(Kapavaram)లో తిరుమల స్కూలు భవనం(Tirumala School Building)పై నుంచి విద్యార్థి కిందపడి మృతి చెందారు. కుమారదేవ గ్రామాని(Kumaradeva Village)కి చెందిన విద్యార్థి రవిచంద్ర(Student Ravi Chandra) రోజు మాదిరిగా సోమవారం సైతం స్కూలు వచ్చారు. మధ్యాహ్న సమయంలో స్కూలు భవనంపై నుంచి కింద పడి రవిచంద్ర అక్కడిక్కడే మృతి చెందారు. దీంతో స్కూల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి మృతిపై కేసు నమోదు చేశారు. రవిచంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
విద్యార్థి మృతి కారణాలేంటి..?
‘‘అసలు రవిచంద్ర స్కూలు భవనంపై నుంచి ఎలా పడ్డారు. ఎందుకు స్కూలుపైకి వెళ్లారు. ఆడుకుంటూ అదుపు తప్పి కింద పడ్డారా.. లేదా ఎవరైనా నెట్టారా..?. తోటి విద్యార్థులతో గొడవలేమైనా ఉన్నాయా..?, లేదా రవిచంద్ర ఆత్మహత్య చేసుకున్నారా..’’ అనే కోణంలో విచారణ చేపట్టారు. ఎంతో భవిష్యతు ఉన్న విద్యార్థి మృతి చెందడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో విషాదచాయలు అలుముకున్నాయి. విద్యార్థి తల్లిదండ్రులైతే శోకసంద్రంలో మునిగిపోయారు.






