సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులు అరెస్ట్..

by Kodari Anjali |

సైబరాబాద్‌లో భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసానికి పాల్పడుతున్న ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులు అరెస్ట్..
X

దిశ, శేరిలింగంపల్లి: సైబరాబాద్‌లో భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసానికి పాల్పడుతున్న ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ మోసాల ద్వారా వచ్చిన అక్రమ నగదును తరలించేందుకు ఉపయోగించే మ్యూల్ బ్యాంక్ ఖాతాలను సరఫరా చేసే ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి నట్లు సైబర్ క్రైమ్ డిసిపి సాయి మనోహర్ వెల్లడించారు. నిందితులు బ్యాంక్ ఖాతాలను ఏర్పాటు చేయడం, ఖాతాదారులను సమకూర్చడం, మోసపూరిత నగదును సేకరించడం, నగదును రవాణా చేయడం వ్యవస్థీకృత సైబర్ నేర ముఠాలకు మనీ లాండరింగ్ కార్యకలాపాలను సులభతరం చేయడంలో కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రాయదుర్గం, మణికొండతో పాటు విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్న సైబర్ క్రైం పోలీసులు నిందితుల అకౌంట్ నుండి 45 లక్షలు స్వాధీనం చేసుకోగా 34 లక్షలు బాధితులకి అప్పగించారు. రాపర్తి గౌతమ్, సేనపాతి పెంటయ్య, బొడ్డాల సాయి కుమార్, మురపాకల కుమార్, విజ్జపు సత్యనారాయణ, మంత్రి సాయి కుమార్, ఉట్ల సత్యనారాయణలను అరెస్ట్ చేశారు. బ్యాంక్ ఖాతాలను సేకరించి, వాటి ద్వారా కోట్ల రూపాయల సైబర్ ఫ్రాడ్ సొమ్మును మనీ లాండరింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.

ఆర్డర్ లింకులను క్లిక్ చేయవద్దు..

ఫ్రాడ్ సొమ్మును నగదు రూపంలో కలెక్ట్ చేసి, ప్రధాన సూత్రధారులకు చేరవేస్తున్న నెట్‌వర్క్ బట్టబయలు చేశారు.బ్లింకిట్ డెలివరీ బాయ్‌గా పనిచేసే బొడ్డాల సాయి కుమార్ ద్వారా క్యాష్ కలెక్షన్ చేసి రాపర్తి గౌతమ్, సేనపాతి పెంటయ్యలకు ఫ్రాడ్ మనీ చేసేవాడు.ఈ నగదు రవాణాలో కీలక పాత్ర పోషించిన బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ విద్యార్థి మంత్రి సాయి కుమార్ ఉన్నాడు. సైబర్ సిండికేట్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు వేట కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.డబ్బు కోసం తమ బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు, కేవైసీ పత్రాలను ఇతరులకు ఇవ్వవద్దు. ఇది తీవ్రమైన నేరంగా పరిగణించాలని అన్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ తదితర సంస్థల పేరుతో వచ్చే అనుమానాస్పద డెలివరీ, ఆర్డర్ లింకులను క్లిక్ చేయవద్దు. అధికారిక యాప్‌లు లేదా వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే ధృవీకరించూసుకోవాలన్నారు. సీబీలో నమోదైన బ్రోకర్లు ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారానే పెట్టుబడులు పెట్టాలి. అధిక లాభాలు వస్తాయని చెప్పే అనధికారిక యాప్‌లు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా గ్రూపులను నమ్మవద్దు. ఇతరుల కోసం బ్యాంక్ ఖాతాలు తెరవడం లేదా తమ ఖాతాలనుఉపయోగించుకునేందుకు అనుమతించడం చేయొద్దని హెచ్చరించారు.

Next Story