- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ సంగతి మీరు చూసుకోండి.. ట్రంప్‌కు మెలోని కౌంటర్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శలపై ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని శనివారం తీవ్రంగా మండిపడ్డారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో మెలోని తనతో ఒక ఫోటో కోసం బతిమలాడారని, ఇటలీలో ఆమె పాపులారిటీ దారుణంగా పడిపోవడంతోనే రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లీ తనతో స్నేహం కోరుకుంటోందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఆరోపించారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శలపై ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని శనివారం తీవ్రంగా మండిపడ్డారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో మెలోని తనతో ఒక ఫోటో కోసం బతిమలాడారని, ఇటలీలో ఆమె పాపులారిటీ దారుణంగా పడిపోవడంతోనే రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లీ తనతో స్నేహం కోరుకుంటోందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఆరోపించారు. ఇరాన్ అణు పరీక్షల వివాదంలో అమెరికా సైనిక చర్యలకు ఇటలీ రన్‌వేలు, ఎయిర్‌ఫీల్డ్‌లను ఉపయోగించుకోనివ్వకుండా మెలోని నిరాకరించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటలీ రక్షణ కోసం అమెరికా వందల బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నా మెలోని మద్దతు ఇవ్వలేదని, ఇరాన్‌పై అమెరికా గెలిచాక ఇప్పుడు రేటింగ్స్ పెంచుకోవడానికి నా దగ్గరకు వస్తోందంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను.. కారణం లేని నిరంతర దాడులుగా అభివర్ణిస్తూ మెలోని ఇన్‌స్టాగ్రామ్‌లో ఘాటుగా సమాధానమిచ్చారు. మీతో స్నేహం చేయడం వల్ల నా ప్రజాదరణకేం ఉపయోగపడలేదు. నా పాపులారిటీ మీతో ఉన్న సంబంధంపై ఆధారపడి లేదు. నా దేశ జాతీయ ప్రయోజనాలను కాపాడటంలో నాకున్న సామర్థ్యంపైనే నా ప్రజాదరణ ఆధారపడి ఉంటుంది అని ఆమె స్పష్టం చేశారు. అమెరికా సైనిక స్థావరాల వినియోగం ముందస్తు ఒప్పందాల ప్రకారమే జరుగుతుందని, తానూ ప్రధానిగా ఉన్నంత కాలం ఆ నిబంధనలను ఉల్లంఘించేది లేదని తేల్చి చెప్పారు. ఇటలీ ఒక సార్వభౌమ దేశం అని గుర్తు చేస్తూ.. నా ప్రజాదరణ గురించి మీకేం అవసరం లేదు.. ముందు మీ సంగతి మీరు చూసుకుంటే మంచిది అని ట్రంప్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.






