- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోర్ముజ్ జలసంధి దాటిన మూడు భారతీయ చమురు ట్యాంకర్లు.. కేంద్ర మంత్రి వెల్లడి!
దాదాపు 8.60 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు, 94 మంది భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మూడు భారతీయ చమురు ట్యాంకర్లు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ శనివారం ప్రకటించారు.

Strait of Hormuz
దిశ, నేషనల్ బ్యూరో: దాదాపు 8.60 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు, 94 మంది భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మూడు భారతీయ చమురు ట్యాంకర్లు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ శనివారం ప్రకటించారు. ఇరాన్-అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 'దేశ్ వైభవ్', 'దేశ్ విభోర్', 'సన్మార్ హెరాల్డ్' అనే మూడు భారతీయ నౌకలు ఈ జలసంధిని దాటి భారతదేశానికి బయలుదేరాయని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ మూడు నౌకలు ప్రయాణాన్ని పూర్తి చేయడానికి ముందు.. భారత జెండాతో ఉన్న మరో 13 కార్గో నౌకలు హోర్ముజ్ జలసంధిలోనే చిక్కుకుపోయాయని, భారతీయ నావికుల భద్రతతో పాటు దేశ ఇంధన అవసరాలను కాపాడటానికి తమ మంత్రిత్వ శాఖ అన్ని ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య బుధవారం తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఈ కీలక జలమార్గం గుండా శుక్రవారం నుండి చమురు రవాణా మళ్లీ పుంజుకుంది. జలసంధి వినియోగంపై ఇరాన్ విధించిన కఠిన నిబంధనల పట్ల ఆందోళనలు ఉన్నప్పటికీ, గల్ఫ్ దేశాల ఉత్పత్తిదారులు తమ చమురు ఎగుమతులను పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇరు దేశాల మధ్య వివాదానికి ముగింపు పలుకుతూ కుదిరిన ఒప్పంద పత్రాన్ని వాషింగ్టన్, టెహ్రాన్‌లు విడుదల చేసినప్పటికీ.. ఇచ్చిన హామీలను ఇరాన్ గౌరవించకపోతే ఆ దేశ అధికారులను లక్ష్యంగా చేసుకుని మళ్లీ దాడులు ప్రారంభిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.






