- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ బాలిక పై అత్యాచారం
by Batti.Sumithra |
జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఓ 15 సంవత్సరాల మైనర్ బాలిక పై అత్యాచారం జరిగింది.

X
దిశ, జిన్నారం : జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఓ 15 సంవత్సరాల మైనర్ బాలిక పై అత్యాచారం జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని మైత్రి పరిశ్రమ ఆవరణలోని గృహసముదాయంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన కార్మికులు నివాసం ఉంటూ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నారు. కాగా శనివారం సాయంత్రం ఓ మైనర్ బాలిక పై ఖాసిం (45) అనే వ్యక్తి అత్యాచారం చేసినట్టు సమాచారం. నిందితుడు పరారీలో ఉన్నాడు. బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






