- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెన్షన్స్ పెరిగిపోతున్నాయని ఇలా చేసేరు.. గుండెకు ప్రమాదం!
ఏడాదికి మించి మెలటోనిన్ సప్లిమెంట్లను వాడేవారిలో గుండె వైఫల్యం సంభవించే అవకాశాలు పెరుగుతున్నాయి.

దిశ, ఫీచర్స్ : ఉరుకులు, పరుగుల జీవితంలో కొందరు తమ ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో రోజువారీ జీవితంలో ఒత్తిడి ఆందోళనలు పెరిగిపోతున్నాయి. అయితే టెన్షన్స్ పెరిగిపోతున్నాయనో, నిద్ర పట్టడం లేదనో కొందరు మెలటోనిన్ సిప్లిమెంట్లు వాడుతుంటారు. దీనివల్ల ప్రశాంతంగా నిద్రపోవచ్చునని, మైండ్ రిలాక్స్ అవుతుందని భావిస్తారు. కానీ ఇది చాలా హానికరం అంటున్నారు వైద్య నిపుణులు. మెదడులో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపించి నిద్ర రావడానికి కారణం అయ్యే ఈ క్యాప్సూల్స్ వాడితే గుండె వైఫల్యం (Heart failure) చెందే అవకాశముందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 2025 సైటిఫిక్ సెషన్స్‌లో ప్రదర్శించిన ఒక అధ్యయనం వెల్లడించింది. ఆ వివరాలేమిటో చూద్దాం.
సైంటిఫిక్ అధ్యయనాల ప్రకారం.. మెలటోనిన్ సప్లిమెంట్లను ఏడాదికిపైగా వాడుతున్న వారిలోనే హార్ట్ ఫెయిల్యూర్స్ సంభవించే అవకాశాలు 90 % వరకు పెరుగుతున్నాయి. స్టడీలో భాగంగా యావరేజ్ ఏజ్ 56 ఏండ్లున్న 1,31,000 మంది నిద్రలేమి రోగుల(Insomnia patients) హెల్త్ డేటాను నిపుణులు పరిశీలించారు. వీరిలో సుమారు 65,000 మంది కనీసం ఒక సంవత్సరం పాటు మెలటోనిన్ మాత్రలు వాడారు. అయితే వీటిని వాడని వారితో పోల్చితే, దీర్ఘకాలం వాడిన వారిలో 5 సంవత్సరాల్లో గుండె వైఫల్యం వచ్చే ప్రమాదం 90 శాతం ఎక్కువగా ఉందని, కనీసం 90 రోజుల వ్యవధితో రెండు సార్లు ప్రిస్క్రిప్షన్ తీసుకున్న వారిలో ఈ రిస్క్ 82 శాతం ఎక్కువగా కనిపించిందని పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా మెలటోనిన్ సప్లిమెంట్లు వాడుతున్న వ్యక్తులు గుండె వైఫల్యం కారణంగా ఆస్పత్రిలో చేరే అవకాశం 3.5 రెట్లు అధికంగా ఉంటున్నదని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వైద్య నిపుణులను సంప్రదించకుండా, వారి సలహాలు లేకుండా మెలటోనిన్ మాత్రలు వాడకూడదని సూచిస్తున్నాయి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






