వరి సాగుకు ప్లాన్..​ 23 నుంచి విత్తన మేళా

by Vemula.Srinu Prasad |

వానాకాలం సీజన్​లో ఏడు రకాల సన్నాలు సాగు చేసేందుకు విత్తనాల కొరత లేకుండా వ్యవసాయ శాఖ జాగ్రత్తలు చేపడుతోంది. అందుకోసం ఈనెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2601 రైతు వేదికల్లో నాలుగు రోజుల పాటు రైతుకు విత్తన మేళా నిర్వహించేందుకు ప్లాన్​చేస్తోంది...

వరి సాగుకు ప్లాన్..​ 23 నుంచి విత్తన మేళా
X

దిశ, తెలంగాణ బ్యూరో : వానాకాలం సీజన్​లో ఏడు రకాల సన్నాలు సాగు చేసేందుకు విత్తనాల కొరత లేకుండా వ్యవసాయ శాఖ జాగ్రత్తలు చేపడుతోంది. అందుకోసం ఈనెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2601 రైతు వేదికల్లో నాలుగు రోజుల పాటు రైతుకు విత్తన మేళా నిర్వహించేందుకు ప్లాన్​చేస్తోంది. దానికి ఏర్పాటు సిద్దం చేయాలని మండల వ్యవసాయాధికారులు సూచనలు చేసినట్లు తెలిసింది. ఖరీప్​సీజన్​కు 15 లక్షల మెట్రిక్​టన్నులు విత్తనాల వినియోగం ఉంటుందని వ్యవసాయ శాఖ భావించిన ఎల్​నినో ప్రభావంతో సాగు ముందు అంచనా వేసినదానికంటే తగ్గుతుంది. సుమారు 37 లక్షల నుంచి 40 లక్షల వరకు వరి పంట వేయవచ్చని అంచనా వేస్తున్నారు. వీటికి 9 లక్షల మెట్రిక్​టన్నులు విత్తనాలు అవసరం అవుతాయని చెప్పారు. వీటిని తక్కువ ధరకే రైతులకు విక్రయిస్తున్నట్లు, ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల సన్నాల విత్తనాలు ప్రైవేటు విత్తన దుకాణాల వద్ద లభించడం కష్టమని ఉన్నతాధికారులు మేళాకు సిద్దమైయ్యారు. ప్రైవేటు డీలర్లు ఈ ఏడు రకాలు అమ్మకుండా మిగతా వాటిని ఇప్పటికే దుకాణాల్లో నిల్వ పెట్టారు. వాటి ద్వారా కమిషన్​ఎక్కువ వస్తోంది.

ప్రభుత్వం ప్రకటించిన వాటికి తక్కువ వస్తోంది. అందుకే ఏడు రకాలపై తప్పడు ప్రచారం చేస్తూ వారి వద్ద ఉన్న విత్తనాలు అమ్ముడు పోయేలా ప్రయత్నాలు మొదలు పెట్టారు. సాగు కాలం ప్రారంభమైన ప్రభుత్వం ప్రకటించిన వాటి విత్తనాలు సరఫరా చేయలేదని, బోనస్​వీటికి చెల్లిస్తామని చెప్పి గుట్టుగా ఆపంట సాగు చేయకుండా ప్లాన్​చేస్తోందని రైతులకు చెబుతున్నారు. మండల వ్యవసాయ అధికారులు డీలర్ల మాటలు నమ్మి మోస పోవద్దని సూచిస్తున్నారు. ప్రైవేటుగా రైతులు విత్తనాలు కొనేటప్పడు సర్టిఫైట్​సీడ్​మాత్రమే కొనాలని, ప్యాకెట్​పై ఉన్న వివరాలు పరిశీలించాలి. మొలక శాతం, తయారీ తేదీ గమనించాలి. అధికారిక డీలర్ల వద్ద మాత్రమే కొనుగోసి రసీదు తప్పని సరిగా తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. సాధారణ విత్తనం ఎకరానికి 12 నుంచి 15 కిలోలు, రెండు ఎకరాలకు 24 నుంచి 30 కిలోలు, ఐదు ఎకరాలకు 60 నుంచి 75 కిలోలు అవసరం ఉంటుంది. పంట అధిక దిగుబడి రావాలంటే ధృవీకరించిన విత్తనాలు మాత్రమే ఉపయోగించాలి. నేల పరీక్షలు తప్పక చేయించుకుని, సమయానికి నారు పోయాలి. నీటి నిర్వహణ సక్రమంగా ఉండటంతో పాటు వ్యవసాయ శాఖ సూచనలు రైతులు తప్పకుండా పాటించాలి.

త్వరగా కోతకు వచ్చే రకాల వైపు రైతుల ఆసక్తి :

రాష్ట్రంలో సన్నరకాల విత్తనాలు ఎన్నో ఉండగా రోగాలు సోకని, తక్కువ కాలంలో కోతకు వచ్చేవి, కలుపు ఇబ్బందులు లేని రకాలను సాగు చేయడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల్లో మొదటి రెండు రకాలు 130 నుంచి 140 రోజుల్లో కోతకు వస్తాయి. తరువాత మూడు రకాలు 120 నుంచి 130 రోజులు పంట చేతికొస్తుంది. ఇతర రకాల సన్నాలు 120 రోజుల లోపే కోత కోయవచ్చు. స్వల కాలంలో వచ్చే పంటల పట్ల రైతులు ఆస్తకి చూపుతున్నారు. వానాకాలం సాగుకు సిద్దమై వరి విత్తనాలు కొనుగోలు బీజీగా ఉన్న రైతులకు వ్యవసాయ శాఖ చేస్తున్న ఏడు రకాల సన్నాలు వేయాలనే నిబంధనలతో సాగు ఆలస్యం కావచ్చని అన్నదాతలు భావిస్తున్నారు. మిగతా రకాలను వేస్తే బోనస్​కు ఎగనామం పెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. సన్నాలు గుర్తించేందుకు ప్రభుత్వం కొన్ని నిబందనలు పెట్టింది. బియ్యపు గింజ పొడువు, వెడల్పుల నిష్పత్తి నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉంటే బోనస్​ఖాతాలో జమ చేయాలని భావిస్తోంది. గ్రెయిన్​కాలిపర్​అనే మిషన్​ద్వారా గింజ పొడువు, వెడల్పు కొలుస్తారు. గింజ పొడువు 6 ఎంఎం, వెడల్పు 2 ఎం ఎం కంటే తక్కువగా ఉండాలి. పొడువు, వెడల్పుల నిష్పత్తి 2.5 ఎంఎం కంటే ఎక్కువ ఉండే వాటిని ప్రాధాన్యత ఇస్తారు. ధాన్యం తేమ శాతం 17 కంటే తక్కువగా ఉండాలి.

బోనస్​ ఎగనామం పెట్టేందుకు ఏడు రకాలు :

ప్రభుత్వం సన్నాలు సాగు చేసేందుకు ప్రోత్సహకంగా ఇస్తున్న రూ.500 బోసస్​ఎగనామం పెట్టడానికి ఏడు రకాల వరి వేయాలనే నిబంధనలు తీసుకొచ్చిందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. బోనస్​పంపిణీతో రాష్ట్రంలో రైతులు సన్నాల వైపు మొగ్గు చూపి గత రెండు సీజన్​లో పెద్ద మొత్తంలో పంట ఉత్పత్తి చేశారు. దీంతో ప్రభుత్వంపై బోనస్​భారం అనుకున్న దానికంటే ఎక్కువ పడుతుంది. అందుకోసం కొన్నింటికి మాత్రమే బోనస్​ఇస్తామని చెబితే వాటిని అందరు రైతులు సాగు చేయడం సాధ్యంకాదు. దీంతో బోనస్​బారం నుంచి బయట పడవచ్చనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్​ని నో ప్రభావంతో వ్యవసాయ శాఖ ముందుగా అంచనా వేసినంత వరి సాగుపై అనుమానం ఉంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్​లో మధ్యంతర కరువు వస్తుండటంతో రైతులు ఈసారి సగానికిపైగా వరి సాగు తగ్గించ వచ్చని తెలుస్తోంది.

Next Story