ఏజెన్సీ వైద్యంపై వైద్యారోగ్య శాఖ ఫోకస్..

by Kodari Anjali |

వనిజ మృతితో ఏజెన్సీ ప్రాంతంలో వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బంది ఖాళీలపై అధికారులు ఫోకస్ పెట్టారు.

ఏజెన్సీ వైద్యంపై వైద్యారోగ్య శాఖ ఫోకస్..
X

దిశ, గుండాల: గత కొన్ని సంవత్సరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బంది ఖాళీలు వైద్యాధికారుల ఖాళీలు ఇతర పోస్టుల ఖాళీలతో ఏజెన్సీ వైద్యం సతమతమవుతున్న వైనం తెలిసింది. ఈ నేపథ్యంలోనే గత నెల 13వ తేదీన గుండాల మండలం గ్రామానికి చెందిన బాలెంత చాట్ల వనిజ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ ఏఎన్ఎం ఫార్మసిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. వైద్య సిబ్బంది లేకపోవడమే ఏజెన్సీ ప్రాంతంలో మాతా శిశు మరణాలు పెరుగుతున్నయని ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఖాళీలు భర్తీకి వైద్య ఆరోగ్యశాఖ ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించిందని విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏజెన్సీ వైద్యంపై దృష్టి సారించి వనిజ మృతి తర్వాత ఏజెన్సీలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్, నేషనల్ హెల్త్ మిషన్ జాయింట్ డైరెక్టర్ సుధీర, డి ఎం ఎన్ హెచ్ ఓ తుకారం రాథోడ్, పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పర్యటించి వణిజ మృతికి కారణాలు తెలుసుకున్నారు.

వెంటనే గుండాలు అంబులెన్స్..

అలాగే వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి ఫోకస్ పెట్టారు. దాంతోపాటు గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న 108 వాహనాన్ని ఇల్లెందుకు తరలించటంపై పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు అధికారులకు ఫోన్ చేసి గట్టిగానే మందలిచ్చారు. వెంటనే గుండాలు అంబులెన్స్ గుండాలకు చేర్చాలని ఏజెన్సీ ప్రాంతంలో పిఓ కలెక్టర్ కన్నా ఎమ్మెల్యే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఏజెన్సీ ప్రాంత ప్రజల ప్రాణాలు మీకు పట్టవాని డిఎంహెచ్ ను ఘాటుగానే మందులు ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతం నుండి పీజీ చదువుల కోసం వెళ్లిన వైద్యాధికారుల స్థానంలో ఖాళీలు భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన రంగం సిద్ధమైనట్లు సమాచారం. కాగా అసలు గుండాల మండలం చెంబునిగూడెం సంఘటనకు బాధ్యులు ఎవరని ప్రజల పేర్కొంటున్నారు. వైద్యాధికారిని సస్పెన్షన్ చేసి చేతులు దులుపుకున్నారే తప్ప వనిజ మృతికి కారణాలేంటి అనే దానిమీద విశ్లేషణ జరగలేదని పలువురు ఆరోపిస్తున్నారు.

వైద్యాధికారి సస్పెన్షన్తో చేతులు దులుపుకున్న అధికారులు

అసలు వనిజ వైద్యం కోసం గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి గుండాల్లో సరైన వైద్యం అందక ఇల్లెందుకు తరలించాక ఇల్లెందులో ఎందుకు జాప్యం జరిగింది? ఆ జాప్యానికి కారకులెవరు? జాప్యం జరిగిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇల్లందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వనిజ చేరుకునేసరికి వనిజకు మూడు శాతం రక్తమే ఉండటం స్థానిక ఇల్లెందు ఆసుపత్రిలో రక్తం లేకపోవడం కొంత సమయం తర్వాత ఇల్లందు నుండి ఖమ్మం తరలించడం ఖమ్మంలో వైద్యం జరుగుతున్న సందర్భంలో మృతి చెందడం జరిగింది.. అసలు విచారణ అధికారులు గుండాల వైద్యాధికారిని సస్పెన్షన్ చేసే ముందు గుండాల ఇల్లెందు ఖమ్మంలో జరిగిన లోపాలను గుర్తించారా? గుర్తిస్తే వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? చర్యలు తీసుకోపోవడానికి గల కారణాలేంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తూతూ మంత్రంగా విచారణ జరిపి గుండాల వైద్యాధికారిని బలి చేశారే తప్ప అసలు లోపాన్ని కనుగొనడంలో వైద్యారోగ్య శాఖ వైఫల్యం చెందిందని పలువురు ఆరోపిస్తున్నారు.

అన్ని విభాగాల్లో సిబ్బందితో పాటు...

ఇంత జరుగుతున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇంకా నిర్లక్ష్యాన్ని విడలేదు. గుండాల వైద్యాధికారిణి సస్పెన్షన్ చేసి మూడు రోజులైనా ఇక్కడ ఒక బాలింత మృతి చెందిన పట్టణ కేంద్రాలకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రాల లేని ప్రాంతమైన ఈ ప్రాంతంలో నేటికీ డాక్టర్ నియమించలేదు. అనేక సందర్భాల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ కావాలని ఇద్దరు వైద్యులు ఉండాలని లబోదిబో మొత్తుకున్న పెడతెచ్చేవన్న పెట్టారు. ఫలితంగానే వనిజం మృతి చెందింది. అయినా నిజాయితీగా విచారణ చేయకుండా తూతూ మంత్రంగానే విచారణ చేశారని పలు రాజకీయ పార్టీల ఆరోపిస్తున్నాయి. ఇకనైనా ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా వైద్య ఆరోగ్యశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ అన్ని విభాగాల్లో సిబ్బందితో పాటు ఇరువురి డాక్టర్ల నియమించాలని ఏజెన్సీలో డాక్టర్లను మీటింగుల పేరుతో పట్టణ ప్రాంతాలకు తరచూ పిలవద్దని మీటింగ్లో పేరుతో పట్టణ ప్రాంతాలకు వెళ్లిన సందర్భంలో సీరియస్ పేషెంట్ వచ్చి మృతి చెందిన సంఘటనలు కూడా జిల్లాలో ఉన్నాయని ఇలాంటి కాకుండా మీటింగ్ లన్ని జూమ్ ద్వారా నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. కాగా అభం శుభం తెలియని పెళ్లయి ఏడాదికే నూరేళ్లు నిండిన వనిజ కుటుంబాన్ని ఆదుకోవాలని వనిజ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు భార్యను ఎన్నో ఆశలతో కన్న పాపను కోల్పోయిన సంజీవరావు ఆదుకోవాలని ఆదివాసి సంఘాలు రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.

Next Story