- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగాల్ సంకెళ్లు వీడాయి.. అభివృద్ధికి కొత్త ఊపిరి: ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అభివృద్ధికి కొత్త అధ్యాయం ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోడీ () పేర్కొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అభివృద్ధికి కొత్త అధ్యాయం ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) పేర్కొన్నారు. శనివారం ‘పశ్చిమబంగ దివస్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, బెంగాల్ ప్రజల తీర్పుతో రాష్ట్రం సంకెళ్ల నుంచి విముక్తి పొందిందని, ప్రజల ముఖాల్లో ఆనందం, విశ్వాసం కనిపిస్తున్నాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మాణానికి అవసరమైన భూముల బదిలీ ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు. గత ప్రభుత్వం ఈ ప్రక్రియను అడ్డుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతిపై చర్యలు తీసుకుంటున్నామని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఈ సందర్భంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ (Syama Prasad Mookerjee)కు నివాళులర్పించిన ప్రధాని, విభజన సమయంలో బెంగాల్‌లోని ఒక భాగం భారత్‌లో ఉండేలా ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అలాగే జూన్ 20 చారిత్రక ప్రాధాన్యాన్ని యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రైల్వేలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మత్స్య, పశుసంవర్ధక రంగాలకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు. బెంగాల్ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం వేగంగా పనిచేస్తోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.






