- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీమిండియాకు బిగ్ షాక్.. ఇంగ్లాండ్ టూరుకు స్టార్ ప్లేయర్ దూరం!
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరో సిరీస్‌కు కూడా దూరం కానున్నట్టు తెలుస్తోంది.

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరో సిరీస్‌కు కూడా దూరం కానున్నట్టు తెలుస్తోంది. గాయం కారణంగా ఇప్పటికే అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ సిరీస్‌కు కూడా అతను దూరమైనట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ వన్డే సిరీస్‌కు ఇంకా జట్టును ఎంపిక చేయలేదు. జూలై 14 నుంచి 19 వరకు మూడు వన్డేల సిరీస్ జరగనుంది. త్వరలోనే టీమ్ ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే, ఆ నాటికి కూడా పాండ్యా ఫిట్‌నెస్ సాధించే అవకాశం లేదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ‘వన్డే ఫార్మాట్‌కు కావాల్సిన బౌలింగ్ సాధన, కండిషనింగ్‌ను పాండ్యా ఇంకా సాధించలేదు. పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి అతనికి మరింత సమయం పడుతుంది’అని సదరు అధికారి పేర్కొన్నారు.పాండ్యా ఈ నెల 2 నుంచి సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌లో రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు.
మరోవైపు, విరాట్ కోహ్లీ కూడా కుడి కాలు తొడ కండరాల గాయంతో అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ టూరుకు అతను కూడా అందుబాటులో ఉండటం అనుమానమే. అయితే,గాయం నుంచి అతను బాగానే కోలుకుంటున్నాడని సదరు అధికారి తెలిపారు. లండన్‌లో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ బృందం అతన్ని పర్యవేక్షిస్తుందని, ఈ నెల 22న అతను క్లియరెన్స్ కోసం సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌కు హాజరవుతాడని పేర్కొన్నారు. కోహ్లీని ఫిట్‌నెస్ లోబడి ఇంగ్లాండ్ టూరుకు ఎంపిక చేసే చాన్స్ ఉంది. సిరీస్ నాటికి కోలుకుంటే ఇంగ్లాండ్‌పై అతను ఆడొచ్చు.






