- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమతో వచ్చేందుకు సిద్ధమైంది.. తెల్లకాగితం షూటింగ్ అప్డేట్ ఇచ్చిన టీమ్
‘కోర్టు’ ఫేమ్ హర్ష రోషన్ మరోసారి లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

దిశ, సినిమా: ‘కోర్టు’ ఫేమ్ హర్ష రోషన్ మరోసారి లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ‘తెల్లకాగితం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో శ్రీదేవి ప్రజెన్స్, అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కొమ్మలపాటి కృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో నక్షత్ర హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఇందులో నుంచి విడుదలైన పోస్టతో సినిమాపై పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ కాగా.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు సినిమా షూటింగ్ పూర్తైనట్లు తెలుపుతూ ఓ పోస్టర్ షేర్ చేశారు. ‘చిరునవ్వులతో చుట్టబడింది.. ప్రేమతో సిద్ధంగా ఉంది.. త్వరలో థియేటర్లలో రాబోతున్న తెల్లకాగితం మీరు ఎప్పటికీ గుర్తుంచుకునేలా ఒక మధురమైన సంగీత ప్రేమకథా అనుభూతిని అందిస్తుంది’ అంటూ పంచుకున్న ఈ పోస్టర్ ప్రజెంట్ వైరల్ అవుతున్నది. లోతైన భావో ద్వేగాలతో సాగే అందమైన ప్రేమకథగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులనూ అలరిస్తుందని పేర్కొన్నారు.






