34 జిల్లాలకు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షుల నియామకం

by Malleboina Mahesh |

తెలంగాణ రాష్ట్రంలోని 34 జిల్లాలకు బీజేపీ అధిష్ఠానం అధికారికంగా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులను నియమించింది.

34 జిల్లాలకు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షుల నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ మహిళా మోర్చా జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. శనివారం పార్టీ అధ్యక్షులు రామచందర్​రావు ఆదేశాల మేరకు మహిళా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి 34 జిల్లాలకు అద్యక్షులను నియమించినట్లు ప్రకటించింది. పార్టీలోకి మహిళలు పెద్ద ఎత్తున చేరేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా ముందుకు అధ్యక్షులను ప్రకటించిన వారం రోజుల తర్వాత పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. త్వరలో జరిగే జీహెచ్​ఎంసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే కమలనాథులు వ్యుహాలకు పదును పెడుతున్నారు.

Next Story