- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి అజారుద్దీన్
మహిళల ఆర్థిక, సామాజిక పురోగతికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళల ఆర్థిక, సామాజిక పురోగతికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో శనివారం నిర్వహించిన ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం మహిళా సాధికారత లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా మహిళా లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడిన మంత్రి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ వెంకట బాల్మూర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.






