- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనానికి స్పందించిన పీడీ కొండపల్లి శ్రీరామ్..
by Kodari Anjali |
గంగారం తండాలో స్వయం సహాయక సంఘాల సభ్యుల సంతకాల ఫోర్జరీ వ్యవహారంపై ‘దిశ’లో ప్రచురితమైన కథనాలకు ఖమ్మం జిల్లా డీఆర్‌డీఏ పీ.డీ కొండపల్లి శ్రీరామ్ స్పందించారు.

X
దిశ, కారేపల్లి: గంగారం తండాలో స్వయం సహాయక సంఘాల సభ్యుల సంతకాల ఫోర్జరీ వ్యవహారంపై ‘దిశ’లో ప్రచురితమైన కథనాలకు ఖమ్మం జిల్లా డీఆర్‌డీఏ పీ.డీ కొండపల్లి శ్రీరామ్ స్పందించారు.రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా అడిషనల్ పీడీని విచారణ అధికారిగా నియమించి సోమవారం నుంచి సమగ్ర దర్యాప్తు చేపడతామని తెలిపారు.డ్వాక్రా సంఘాల వ్యవహారాల్లో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, మహిళల హక్కులకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. విచారణలో ఫోర్జరీ జరిగినట్లు తేలితే సంబంధిత బుక్‌కీపర్ ప్రసాద్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చిన ‘దిశ’ కథనాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
Next Story






