- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
22వ తేదీ నుంచి హైడ్రా ప్రజావాణి కంటిన్యూ
ఈ నెల 22 నుంచి యథాతథంగా 'హైడ్రా ప్రజావాణి'.. వర్షాకాల ముంపు సమస్యలపై ప్రత్యేక దృష్టి! కానీ ఈ సోమవారం జీహెచ్ఎంసీ ప్రజావాణి రద్దు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీ నుంచి యథాతథంగా కొనసాగిస్తున్నట్టు హైడ్రా శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఎదురయ్యే సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పింది. నగరంలో వర్షాకాలం ఎదురయ్యే సమస్యలు, నీట మునిగే ప్రాంతాలు, అందుకు గల కారణాలను ఫిర్యాదులో వివరంగా పేర్కొనాలని సూచించింది. వాటి పరిష్కారానికి హైడ్రా అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపింది. వరద కాలువలు, చెరువుల కబ్జాలతో పార్కులు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల ఆక్రమణలు ఏవైనా ఉంటే హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొంది. వరదలకు గల కారణాలను వివరించడంతో పాటు... ఎప్పటి నుంచి ఆ సమస్య ఉందో తెలపాలని సూచించింది.
జీహెచ్ఎంసీ ప్రజావాణి రద్దు..
పరిపాలన కారణాల దృష్ట్యా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈనెల 22వ తేదిన (సోమవారం) జరగాల్సిన 'ప్రజావాణి' కార్యక్రమాన్ని రద్దు చేయయనున్నట్టు బల్దియా ప్రకటించింది. నగరవాసులు ఈ అంశాన్ని గుర్తించి తమ ఫిర్యాదులను వచ్చే సోమవారం 29వ తేదీన జరిగే ప్రజావాణిలో అందజేయడానికి అవకాశముందని వెల్లడించింది.






