అన్నదాత సుఖీభవ నిధుల విడుదల.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

పల్నాడు జిల్లా లింగంగుంట్లలో పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. రైతుల ఖాతాల్లోకి మొత్తం రూ.3125 కోట్లు చేరాయని ఆయన తెలిపారు. ...

అన్నదాత సుఖీభవ నిధుల విడుదల.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా లింగంగుంట్లలో పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. రైతుల ఖాతాల్లోకి మొత్తం రూ.3125 కోట్లు చేరాయని ఆయన తెలిపారు. అధికారంలోకి వస్తే రూ. 20 వేలు ఇస్తామని హామీ ఇచ్చామని, ప్రతి ఏడాది నగదు జమ చేస్తున్నామని చెప్పారు. తొలివిడతగా ఆ రోజు ఒక్కొక్కరి ఖాతాలో రూ. 7 వేలు జమ చేశామని చంద్రబాబు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉండాలనాదే తన ఆకాంక్ష అని ఆయన తెలిపారు. సంపద సృష్టిస్తామని ఎన్నికలకు ముందు చెప్పామని, అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

కేవలం 48 గంటల్లోనే జమ

గతంలో ధాన్యం కొనుగోలు చేసిన 6 నెలలకు కూడా డబ్బులు వచ్చేవికావని, కానీ తమ ప్రభుత్వం మాత్రం కేవలం 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి పూర్తి డబ్బులను జమ చేస్తుందని చంద్రబాబు చెప్పారు. గత ఐదేళ్లలో రాష్ట్రం చాలా విధ్వంసానికి గురైందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వికాసం వైపు నడిపిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతులకు అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. తాతాల్కిక ప్రయోజనం కోసం రైతులు అధికంగా వినియోగిస్తున్నారని, అయితే రసాయనాలు ఎక్కువగా ఉన్నాయని ఇతర దేశాలు మన ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడంలేదని తెలిపారు. ఇలా జరిగితే మనకే నష్టం జరుగుతుందన్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్‌గా తయారైందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story