రైతులు అంటే కాంగ్రెస్ కు ఎందుకు అంత చులకన

by velandi.Saikiran |

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, కనీస ప్రణాళిక లేకపోవడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారని లక్ష్మారెడ్డి అన్నారు.

రైతులు అంటే కాంగ్రెస్ కు ఎందుకు అంత చులకన
X

దిశ, జడ్చర్ల : కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, కనీస ప్రణాళిక లేకపోవడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం జడ్చర్లలోని అంబేద్కర్ కలభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంత ధాన్యం కొనుగోలు చేస్తే, తాము కూడా అంతే కొనుగోలు చేస్తామని చెప్పడం సిగ్గుచేటు అని మండిప‌డ్డారు.

వర్షాకాలానికి ముందే చెరువులను కుంటలను మిషన్ కాకతీయ పేరుతో బాగుచేసి రాష్ట్రంలో 45 వేల చెరువులకు పునర్జీవం అందించమన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు, తొమ్మిద‌న్న‌ర‌ ఏళ్లలో 72 వేల కోట్లతో 11 విడుతలుగా రైతుబంధు సాయం అందించామన్నారు. కరోనా లాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రైతుబంధు రైతు బీమా పథకాలు ఆపలేదన్నారు. అనుకోని ప్రమాదం జరిగి కుటుంబ పెద్ద ప్రాణాలు కోల్పోతే ఒక గుంట పొలం ఉన్న రైతుకు కూడా రూ. 5 లక్షల బీమా అందించామని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా అడ్డంకులే

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ రెండున్నర ఏళ్లలోనే రైతులను నాన ఇబ్బందులకు గురి చేస్తుందని లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు కూడా సరైన సమయానికి అందించలేని దుస్థితి ఏర్పడిందని, మూడు విడతలు రైతుబంధు ఎగ్గొట్టి అన్నదాతలను అవస్థలకు గురిచేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేవలం ఒక్కసారి మాత్రమే పూర్తిస్థాయిలో రైతుబంధు నిధులు విడుదల చేసి దానికి మళ్లీ పెద్ద ఎత్తున సంబరాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కనీసం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని ఇలాంటి హంగు ఆర్భాటం ప్రచారం లేకుండానే నేరుగా రైతు ఖాతాల్లో నిధులు జమ అయ్యాయని చెప్పారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కొడగల్ యాదయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ దోరేదేపల్లి లక్ష్మి, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పిట్టల మురళి మండల అధ్యక్షుడు రఘుపతి రెడ్డి బి ఆర్ ఎస్ నాయకులు ప్రనిల్ చందర్, కోట్ల ప్రశాంత్ రెడ్డి చైతన్య గౌడ్, లత, సతీష్,నందకిషోర్,శంకర్ నాయక్,హాఫిజ్ ఉర్ రహేమాన్, దాణేష్,దేవా,పర్వత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story