- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ కంపెనీలు సీజ్.. క్రిమినల్ కేసులు పెడతాం: మంత్రి ఆనం
పొగాకు రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీసుకెళ్లారు. దీంతో సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. పొగాకు కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు...

దిశ, వెబ్ డెస్క్: పొగాకు రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీసుకెళ్లారు. దీంతో సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. పొగాకు కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు, చంద్రబాబు జారీ చేసిన ఆదేశాలను మంత్రి ఆనం రామనారాయణ మీడియాకు వివరించారు.
రూ. 200 కంటే తగ్గించి కొనడానికి వీల్లేదని ఆదేశం
‘‘అన్నదాతల పక్షాన నిలబడుతూ ఇకపై ఏ ప్లాట్‌ఫారమ్ మీద కూడా ఏ కంపెనీ రూ. 200 కంటే తగ్గించి కొనడానికి వీల్లేదు. రైతు యార్డుకు తెచ్చిన పొగాకు బేళ్లను ఆ రోజే కొనుగోలు పూర్తి చేయాలి తప్ప, వెనక్కి పంపే పరిస్థితి రానివ్వకూడదు. అన్ని కంపెనీలు వేలంలో పాల్గొని పోటీ పడి పాడాల్సిందే, లేనిపక్షంలో ఆ కంపెనీలను పూర్తిగా బ్యాన్ చేస్తాం.’’ అని చంద్రబాబు చెప్పినట్లు మంత్రి రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
ఆ కంపెనీలు సీజ్
‘‘యార్డు వెలుపల లోపాయకారీగా ఎవరైనా రైతుల దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేస్తే.. ఆ కంపెనీలను సీజ్ చేయడమే కాకుండా, యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపడం జరుగుతుంది అని ముఖ్యమంత్రి గట్టి వార్నింగ్ ఇచ్చారు. మన కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షపాత ప్రభుత్వం. అన్నదాతను మోసం చేయాలని చూసే సిండికేట్ వ్యాపారుల ఆటలు ఇక సాగవు.’’ అని పొగాకు కంపెనీల యజమానులకు సీఎం చంద్రబాబు తెలిపినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.






