- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sun Pharma: మరో కంపెనీని సొంతం చేసుకున్న సన్ ఫార్మా
ముంబైకి చెందిన ప్రముఖ ఫార్మా, హెల్త్ సప్లిమెంట్స్ (న్యూట్రాస్యూటికల్స్), సౌందర్య ఉత్పత్తుల (కాస్మెస్యూటికల్స్) మార్కెటింగ్ సంస్థ ‘ఇన్నోవ్‌కేర్ లైఫ్‌సైన్సెస్’ లోని 100 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ఔషధ తయారీ సంస్థ సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్ తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసుకునేందుకు భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ముంబైకి చెందిన ప్రముఖ ఫార్మా, హెల్త్ సప్లిమెంట్స్ (న్యూట్రాస్యూటికల్స్), సౌందర్య ఉత్పత్తుల (కాస్మెస్యూటికల్స్) మార్కెటింగ్ సంస్థ ‘ఇన్నోవ్‌కేర్ లైఫ్‌సైన్సెస్’ లోని 100 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఎక్స్ఛేంజ్‌కు సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ఒప్పందం విలువ సుమారు 28.7 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 271.2 కోట్లు) పూర్తి నగదు చెల్లింపు ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు సన్ ఫార్మా అధికారికంగా ప్రకటించింది. 2014లో ఏర్పాటై, కేవలం భారత మార్కెట్లోనే బలమైన పంపిణీ నెట్‌వర్క్ కలిగిన ఇన్నోవ్‌కేర్ కంపెనీ ఆర్థికంగా స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. ఈ కంపెనీ వార్షిక ఆదాయం 2023-24లో రూ. 80.93 కోట్లుగా ఉండగా, అది 2024-25 లో రూ. 86.09 కోట్లకు, తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 94.06 కోట్లకు చేరింది. ఈ కొనుగోలు ప్రక్రియకు ఎలాంటి ప్రభుత్వ లేదా ఇతర నియంత్రణ సంస్థల ప్రత్యేక అనుమతులు అవసరం లేదని, అలాగే ఇందులో తమ ప్రమోటర్లకు ఎలాంటి సొంత లాభాలు లేవని సన్ ఫార్మా స్పష్టం చేసింది. జూలై 31లోపు ఈ డీల్‌ను పూర్తిగా ముగించి ఇన్నోవ్‌కేర్‌పై పూర్తి నియంత్రణను దక్కించుకోనున్నట్టు కంపెనీ వెల్లడించింది. గతంలో సన్ ఫార్మా కంపెనీ రాన్‌బాక్సీ లాబొరేటరీస్,కారో మెడికల్స్, కన్సర్ట్ ఫార్మాస్యూటికల్స్, మిత్స్ హెల్త్‌కేర్ కంపెనీలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.






