- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND vs AFG 3rd ODI: రెచ్చిపోయిన ప్రసిద్ద్ కృష్ణ.. ఆఫ్ఘనిస్తాన్ ఆలౌట్
ఆఫ్ఘనిస్తాన్‌ను కుప్పకూల్చిన ప్రసిద్ధ్ కృష్ణ (5/23).. హస్మతుల్లా సెంచరీ చేసినా 218 పరుగులకే ఆలౌట్! భారత్ టార్గెట్ 219.

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో మరోసారి ఆఫ్ఘాన్ ఆలౌట్ అయింది. ఈ చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మూడో వన్డేలో టాస్ గెలిచిన ఆఫ్ఘాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ధాటికి బ్యాటర్లు కుప్పకూలిపోయారు. వెంట వెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టకు కెప్టెన్ హష్మతుల్లా ఆదుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ దైర్యంగా ఆడుతూ సెంచరీ నమోదు చేసకున్నాడు. అలాగే అజ్మతుల్లా కూడా 50 పరుగలతో రాణించడంతో 44.2 ఓవర్లకు 218 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆలౌట్ అయింది. ఈ మ్యాచులో భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ.. 8. 2 ఓవర్లు వేసి 5 వికెట్లు తీసుకున్నాడు. అలాగే గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దుబేలు ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచులో భారత జట్టు విజయం సాధించాలంటే.. నిర్ణీత 50 ఓవర్లలో 219 పరుగులు చేయాల్సి ఉంది.






