పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ ల్లో వారికి ఉచితంగా ప్ర‌యాణం!

by velandi.Saikiran |

నీట్ (NEET) ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) ప్రత్యేక సౌకర్యం కల్పించినట్లు తొర్రూర్ డిపో మేనేజర్ కే. ప్రసూన లక్ష్మి తెలిపారు.

పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ ల్లో వారికి ఉచితంగా ప్ర‌యాణం!
X

దిశ, తొర్రూర్ : ఈ నెల 21వ తేదీ ఆదివారం నిర్వహించనున్న నీట్ (NEET) ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) ప్రత్యేక సౌకర్యం కల్పించినట్లు తొర్రూర్ డిపో మేనేజర్ కే. ప్రసూన లక్ష్మి తెలిపారు. టీజీఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు నీట్ పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ను చూపించి ఆ ఒక్కరోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ సౌకర్యం మహిళా విద్యార్థులతో పాటు పురుష విద్యార్థులకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు.

పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులతో పాటు సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా విద్యార్థులను ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించాలని తొర్రూర్ డిపోకు చెందిన కండక్టర్లు, టీఐఎంలు, డ్రైవర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందస్తుగా తమ పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సిబ్బంది పూర్తి సహకారం అందించాలని డిపో మేనేజర్ కోరారు. నీట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం టీజీఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు...

Next Story