- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిద్రమత్తులో విద్యుత్ శాఖ
వెల్దుర్తి మండలంలో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, వెల్దుర్తి : వెల్దుర్తి మండలంలో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజుల క్రితం వెల్దుర్తి గ్రామ సమీపంలోని ఎలుకపల్లె దారిలో ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా రెండు విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోవడంతో సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ నేలకూలింది. ఖరీఫ్ సాగు కోసం వ్యవసాయ భూములను సిద్ధం చేసుకోవాల్సిన సమయంలో బోరు బావులు నడపడానికి విద్యుత్ అత్యవసరమని సంబంధిత రైతులు తెలిపారు.
రోడ్డు పక్కన ప్రమాదకరంగా పడివున్న విద్యుత్ స్తంభాలను తొలగించి, కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి, ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన లేదని రైతులు వెంకటయ్య, నరసింహులు ఆరోపించారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, పడిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌కు వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని రైతులు కోరారు. లేకపోతే గ్రామ రైతులంతా కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.






