కంటెంట్‌ను నమ్మి ప్రేక్షకులు ఆదరించడం చూస్తుంటే మాటలు రావడం లేదు.. సమంత ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-20 10:55:45  IST  )

మొదటి రోజే సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్స్, కలెక్షన్లు రావడం చూస్తుంటే తనకు మాటలు రావడం లేదని, ఈ విజయం తనలో ఎంతో సంతోషాన్ని నింపిందని ఆమె అన్నారు.

కంటెంట్‌ను నమ్మి ప్రేక్షకులు ఆదరించడం చూస్తుంటే మాటలు రావడం లేదు.. సమంత ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంతతో పాటు ఆమె భర్త రాజ్ నిడిమోరు నిర్మించారు. భారీ అంచనాల మధ్య జూన్ 19న విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు పొందుతోంది. అంతేకాకుండా భారీ కలెక్షన్స్‌ను రాబడుతోంది. మొదటి రోజే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వరల్డ్ వైడ్‌గా రూ.13 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ భారీ విజయంతో సమంత కంబ్యాక్ ఇవ్వడం అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ అద్భుతమైన సక్సెస్‌పై సమంత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. మొదటి రోజే సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్స్, కలెక్షన్లు రావడం చూస్తుంటే తనకు మాటలు రావడం లేదని, ఈ విజయం తనలో ఎంతో సంతోషాన్ని నింపిందని ఆమె అన్నారు.

సినిమాలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు అని చూడకుండా.. కేవలం మంచి కంటెంట్‌ను నమ్మి ప్రేక్షకులు ఇంతలా ఆదరించడం చూస్తుంటే తనకు చాలా గర్వంగా ఉందన్నారు. థియేటర్లలో యువత నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయడం అద్భుతమైన విషయమని ఆమె పేర్కొన్నారుఅన్నిటికంటే ముఖ్యంగా, సాధారణంగా సినిమా ఓపెనింగ్స్ అంటే కేవలం పురుష ప్రేక్షకులకే పరిమితం అనే ఒక టాక్ ఇండస్ట్రీలో ఉండేదని, కానీ ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి మహిళా ప్రేక్షకులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చి థియేటర్లను హౌస్‌ఫుల్ చేయడం తనను ఎంతగానో కదిలించిందని సమంత ఆనందం వ్యక్తం చేశారు. సినిమా పట్ల ప్రేక్షకుల ఆలోచనా విధానం మారుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. చివరగా, తన చిన్న నిర్మాణ సంస్థ ఇంతటి భారీ విజయాన్ని సాధించిందని సంతోషపడుతూ ‘ట్రాలాలా’ అని సమంత తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

'మా ఇంటి బంగారం' ఫస్ట్ డే కలెక్షన్లతో స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన సమంత

Next Story