- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'మా ఇంటి బంగారం' ఫస్ట్ డే కలెక్షన్లతో స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన సమంత
'మా ఇంటి బంగారం' చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.13.15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: సమంత తాజాగా 'మా ఇంటి బంగారం' అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. మొదటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండటంతో మూవీకి సూపర్ ఓపెనింగ్స్ లభించాయి. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను అధికారికంగా ప్రకటించింది. వాటి ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.13.15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు వెల్లడించారు.
ఇటీవలి కాలంలో మీడియం రేంజ్ హీరోలు నటించిన కొన్ని సినిమాలకు కూడా తొలి రోజు ఈ స్థాయి ఓపెనింగ్స్ దక్కడం లేదు. దీంతో సమంత క్రేజ్ మరోసారి నిరూపితమైందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే మరో ఒకటి, రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో భారీ విజయాలు సాధిస్తే, స్టార్ హీరోలకు సమానంగా ఓపెనింగ్స్ రాబట్టే స్థాయికి సమంత చేరుకునే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వూరు సంయుక్తంగా నిర్మించారు.






