- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
40వ ఒలింపిక్ డే రన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40వ ఒలింపిక్ డే రన్‌ను ఘనంగా నిర్వహించారు.

దిశ, కామారెడ్డి : అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40వ ఒలింపిక్ డే రన్‌ను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి జెండా ఊపి ఒలింపిక్ డే రన్‌ను ప్రారంభించారు. కామారెడ్డి జడ్‌పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాల వద్ద ప్రారంభమైన రన్ కాకతీయ నగర్‌లోని సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల వరకు కొనసాగింది.
ఈ రన్‌లో విద్యార్థులు, క్రీడాకారులు, యువత, క్రీడాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయన్నారు. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఒలింపిక్ స్ఫూర్తి, క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, ఐక్యత వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు విక్టర్, ఎన్వీ గిరి, సంబంధిత జిల్లా అధికారులు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ డా. కే.పీ.అనిల్ కుమార్, చైర్మన్ డా.ఎం.జైపాల్ రెడ్డి, క్రీడా సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.






