- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హనుమకొండలో పేదల ఇళ్ళ కూల్చివేత దుర్మార్గం
గుండ్ల సింగారంలో పేదల ఇళ్ళు కూల్చి వేయడం దుర్మార్గమని కూనంనేని సాంబశివరావు అన్నారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్: గుండ్ల సింగారంలో పేదల ఇళ్ళు కూల్చి వేయడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం గుండ్ల సింగారంలో పేదల ఇళ్ళు కూల్చివేత విషయం తెలుసుకున్న కూనంనేని సాంబశివరావు, హుటా హుటిన హైదరాబాద్ నుండి హనుమకొండకు చేరుకొని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు,జిల్లా సిపిఐ నాయకులతో కలిసి గుండ్ల సింగారంలో కూల్చి వేసిన గుడిసెలను సందర్శించారు. అనంతరం కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ గుండ్ల సింగారంలో ఇండ్లు కోల్పోయిన పేదలకు న్యాయం జరిగే వరకూ తాము అండగా ఉంటామని అన్నారు. భూ కబ్జాదారులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించని అధికారిక యంత్రాంగం, నిలువ నీడ లేని పేదలు 50 గజాల స్థలంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారిపై అర్ధరాత్రివేళ దొంగల మాదిరిగా దాడి చేయడం దుర్మమార్గమైన చర్య అన్నారు.
దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ స్పందించి ఇలాంటి దుశ్చర్యలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. నిలుపుదల చేయని ఎడల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అన్నారు. ఇలాంటి దుశ్చర్యలను నిలుపుదల చేయకుంటే హనుమకొండ, వరంగల్ జిల్లాల నుండే రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్ళ స్థలాల పోరాటం ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, సిపిఎం జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి, సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ బాషుమియా, సిపిఐ హనుమకొండ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు అదరి శ్రీనివాస్, మేకల రవి, మండ సదాలక్ష్మి, వలీ ఉల్లాఖాద్రి, హనుమకొండ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, సిపిఎం జిల్లా నాయకులు ఎం. చుక్కయ్య, బొట్ల చక్రపాణి, సిపిఐ జిల్లా నాయకులు కర్రె లక్ష్మణ్, బాషబోయిన సంతోష్ తదితరులు పాల్గొన్నారు.






