విశ్వనాథ్ అండ్ సన్స్’ పోస్టర్‌లో మమిత పేరు లేకపోవడంపై నటి ఫైర్.. సంచలన పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |

ఇది చాలా అన్యాయం, ఇలాంటి ట్రెండ్‌ను మార్చాల్సిన సమయం వచ్చింది. మమితా బైజు తన ప్రతిభతోనే ఇంత పెద్ద సినిమాలో అవకాశం సంపాదించుకుంది.

విశ్వనాథ్ అండ్ సన్స్’ పోస్టర్‌లో మమిత పేరు లేకపోవడంపై నటి ఫైర్.. సంచలన పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, వెంకీ అట్లూరి కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ సినిమాలో ‘ప్రేమలు’ ఫేమ్ నటి మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 14న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇక ఇటీవల మూవీ మేకర్స్ మ్యూజికల్ జర్నీ ప్రారంభించి ఫస్ట్ సింగిల్‌ ‘పట్టాంపూచి’ అని సాగే పాటను రిలీజ్ చేశారు. అయితే, ఈ సాంగ్ పోస్టర్‌పై హీరోయిన్ మమితా బైజు పేరును ఎక్కడా లేకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. తాజాగా, ఈ విషయంపై నటి సనమ్ శెట్టి ట్విట్టర్ ద్వారా స్పందించింది. పోస్టర్‌లో హీరో సూర్య, సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్, డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య పేర్లు ఉన్నప్పటికీ.. హీరోయిన్ పేరును మాత్రం వదిలేశారని సనమ్ శెట్టి తప్పుబట్టారు.

"పోస్టర్‌పై లీడ్ హీరోయిన్ పేరు వేయడానికి మేకర్స్‌కు వచ్చిన అభ్యంతరం ఏంటి? ఇది చాలా అన్యాయం, ఇలాంటి ట్రెండ్‌ను మార్చాల్సిన సమయం వచ్చింది. మమితా బైజు తన ప్రతిభతోనే ఇంత పెద్ద సినిమాలో అవకాశం సంపాదించుకుంది. ఒకవేళ ఆమె కొత్త నటి అయినప్పటికీ, హీరోయిన్‌కు అన్ని చోట్లా సమాన గుర్తింపు, క్రెడిట్ దక్కాలి. సినిమా పరిశ్రమ మారాల్సిన అవసరం ఉంది" అని సనమ్ శెట్టి రాసుకొచ్చారు. దీనిపై ఒక నెటిజన్ ప్రశ్నిస్తూ.. కేవలం సూర్య సినిమా పోస్టర్‌ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అడగ్గా, సనమ్ స్పందిస్తూ.. "ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట ప్రశ్నించాలి కదా! ఇది ఏ సినిమా మధ్య ఉన్న పోటీనో కాదు. నాకు హీరో సూర్య గారిపై ఎంతో గౌరవం ఉంది. నా ప్రశ్న పరిశ్రమలో ఉన్న సాధారణ సినిమా సంస్కృతి గురించే కానీ, ఆయనపై వ్యక్తిగతంగా కాదు. హీరోయిన్ పాత్రకు కథలో ప్రాధాన్యత ఉండి, ఆమెను ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నప్పుడు పోస్టర్లలో కూడా పేరు ఇవ్వడం కనీస గౌరవం" అని స్పష్టం చేశారు.

Next Story