రైతు క్షేత్రంలో.. చంద్రన్న ముచ్చట్లు!

by Vemula.Srinu Prasad |

పల్నాడు జిల్లా లింగంగుంట్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పీఎమ్ కిసాన్.. అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు. అయితే అంతకుముందు లింగంగుంట్లలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు గుడిపల్లి నాగభూషణం కు చెందిన పొలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. ..

రైతు క్షేత్రంలో.. చంద్రన్న ముచ్చట్లు!
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా(Palnadu Disrict) లింగంగుంట్ల(Lingamguntla)లో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పీఎమ్ కిసాన్(Pm Kisan).. అన్నదాత సుఖీభవ(Annadatha Sukhibhava) నిధులను విడుదల చేశారు. అయితే అంతకుముందు లింగంగుంట్లలో ప్రకృతి వ్యవసాయం(Natural Farming) చేస్తున్న రైతు గుడిపల్లి నాగభూషణం(Farmer Gudipalli Nagabhushanam)కు చెందిన పొలాన్ని( Field) ముఖ్యమంత్రి చంద్రబాబు(Chief Minsiter Chandrababu) సందర్శించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ విధానాన్ని సీఎంకు నాగభూషణం వివరించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల పెట్టుబడి వ్యయం తగ్గుతుందని తెలిపారు. అంతేకాదు భూసారం, దిగుబడులు పెరిగి వ్యవసాయం లాభసాటిగా మారిందని చెప్పారు.

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం

అయితే సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని నాగభూషణంకు తెలిపారు. రసాయనాల వల్ల కలిగే నష్టాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నామని సీఎం చెప్పారు. ఇదే సమయంలో నాగభూషణానికి చెందిన గానుగను కూడా సీఎం పరిశీలించారు. వేరుశనగ, నువ్వులు, కొబ్బరి తదితర నూనెగింజలను సహజ పద్ధతిలో గానుగ ద్వారా నూనె ఉత్పత్తి చేయడంపై సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని పరిశీలన

అనంతరం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సైతం సీఎం చంద్రబాబు సందర్శించారు. జీవామృతం, ఘన జీవామృతం, వేపాస్త్రం వంటి సహజ వ్యవసాయ ఉత్పాదనలను ఆయన పరిశీలించారు. అలాగే స్థానికంగా లభించే వనరులతో తయారు చేసి రైతులకు అందజేస్తున్న విధానాన్ని సీఎం పరిశీలించారు.

Next Story