ప్రైవేట్ బస్సులో భారీ దోపిడీ: క్షణాల్లో మాయమైన 2 కిలోల బంగారం

by Vemula.Srinu Prasad |

ప్రైవేటు బస్సులో భారీ చోరీ జరిగింది. సుమారు 2 కిలోల బంగారం గాయబ్ అయింది. ఈ ఘటన డోన్ సమీపంలో జరిగింది. అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు బంగారం వ్యాపారి మోతీలాల్ ప్రైవేటు బస్సు ఎక్కారు...

ప్రైవేట్ బస్సులో భారీ దోపిడీ: క్షణాల్లో మాయమైన 2 కిలోల బంగారం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రైవేటు బస్సులో భారీ చోరీ జరిగింది. సుమారు 2 కిలోల బంగారం గాయబ్ అయింది. ఈ ఘటన డోన్ సమీపంలో జరిగింది. అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు బంగారం వ్యాపారి మోతీలాల్ ప్రైవేటు బస్సు ఎక్కారు. అయితే ఆయన దగ్గర 2 కిలోల బంగారం నంద్యాల జిల్లా డోన్ సమీపంలో మాయం అయింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. అయితే ఈ చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతరం నుంచి వస్తున్న బస్సు డోన్ సమీపంలో ఓ దాబా వద్ద కొంతసేపు ఆగింది. ఆ సమయంలో వ్యాపారి మోతీలాల్ బ్యాగులో ఉన్న బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టేశారు. అనంతరం అక్కడి నుంచి దిగిపోయారు.

జడ్చర్ల దాటిన తర్వాత గమనించిన వ్యాపారి

అయితే బంగారం పోయిన విషయాన్ని బస్సు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల దాటిన తర్వాత గమనించారు. దీంతో బాధితుడు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే డోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు డోన్ సమీపంలోని సీసీ టీవీ ఫుటేజులను పరిశీస్తున్నారు. బస్సులోకి ప్రయాణికులను సైతం విచారించారు. అయితే కోట్ల విలువైన బంగారం క్షణాల్లో చోరీకి గురికావడంపై అంతా షాక్‌కు గురయ్యారు. లబోదిబోమంటున్న వ్యాపారి మోతిలాల్ ముఖం చూసి అయ్యో పాపం అన్నారు. పోలీసులు త్వరగా దొంగలను గుర్తించి మోతీలాల్ బంగారాన్ని రికవరీ చేయాలని కోరుకున్నారు.

Next Story