పాలవరం డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి : సర్పంచ్ మట్టపల్లి నరేష్

by Batti.Sumithra |

అనంతగిరి మండలంలోని పాలవరం గ్రామ ప్రధాన రహదారి వెంబడి డ్రైనేజీ సౌకర్యం లేక వర్షాకాలంలో మురుగునీరు రోడ్ల పై నిలిచిపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ సర్పంచ్ మట్టపల్లి నరేష్ గౌడ్ తెలిపారు.

పాలవరం డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి : సర్పంచ్ మట్టపల్లి నరేష్
X

దిశ, అనంతగిరి : అనంతగిరి మండలంలోని పాలవరం గ్రామ ప్రధాన రహదారి వెంబడి డ్రైనేజీ సౌకర్యం లేక వర్షాకాలంలో మురుగునీరు రోడ్ల పై నిలిచిపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ సర్పంచ్ మట్టపల్లి నరేష్ గౌడ్ తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నూతన డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని హైదరాబాద్‌లో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గ్రామప్రజల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆమె సానుకూలంగా స్పందించి త్వరలోనే నిధులు మంజూరు చేసి డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Next Story