తండాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. సమస్యలు తెలపండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Batti.Sumithra |

మఠంపల్లి మండల పరిధిలోని కామాక్షికుంట తండా నుంచి చిన్నయ్యపాలెం వరకు రూ.2.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న రోడ్డు పనులకు శనివారం శంకుస్థాపన నిర్వహించారు.

తండాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. సమస్యలు తెలపండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, మఠంపల్లి : మఠంపల్లి మండల పరిధిలోని కామాక్షికుంట తండా నుంచి చిన్నయ్యపాలెం వరకు రూ.2.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న రోడ్డు పనులకు శనివారం శంకుస్థాపన నిర్వహించారు. కామాక్షికుంట తండా సర్పంచ్ గోవిందు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గిరిజన మహిళలు, తండా వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని తండాలు, గ్రామాల్లో పంచాయతీ భవనాలు లేని ప్రాంతాలను గుర్తించి కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

శిథిలావస్థకు చేరుకున్న పాత భవనాల స్థానంలో నూతన భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, తాగునీటి సమస్యలు ఉన్న గ్రామాల వివరాలను తన కార్యాలయానికి తెలియజేయాలని, అవసరమైన చోట్ల వెంటనే మంచినీటి సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. మఠంపల్లి మండల ప్రజలు తన పై చూపుతున్న ప్రేమాభిమానాలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, ఈ ప్రాంతంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని గిరిజన మహిళలు, ప్రజల సమక్షంలో ప్రత్యేకంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా సంప్రదాయాన్ని గౌరవిస్తూ అందరినీ "రామ్ రామ్" అంటూ ఆప్యాయంగా పలకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మండలంలో అత్యవసరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన జాబితాను అందిస్తే, ప్రాధాన్యత ఆధారంగా వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.

ఫోటోలో : కామాక్షికుంట తండాలో రూ.2.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న రచ్చబండ భవనానికి ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫలకం. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ తండాల సర్పంచులు, మండల పార్టీ అధ్యక్షుడు మంజు నాయక్, నవీన్ నాయక్, భాస్కర్ నాయక్, ముఖం నరసింహారావు, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story