నేను హోంమంత్రిని కాకపోవడంతో క్రిమినల్స్ బతికి పోతున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

by Malleboina Mahesh |

కులాల దరిద్రం వదిలితేనే ఏపీ బాగుపడుతుంది.. నేను హోంమంత్రిని కాకపోవడంతోనే నేరగాళ్లు బ్రతికిపోతున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్!

నేను హోంమంత్రిని కాకపోవడంతో క్రిమినల్స్ బతికి పోతున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు, కుల రాజకీయం, నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుల తీరు పై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy Chief Minister Pawan Kalyan) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కులాల దరిద్రం వదిలితేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఒక దళిత డ్రైవర్‌ను దారుణంగా చంపి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు లేని కులం.. ఇప్పుడు నేరస్థులపై చర్యలు తీసుకుంటుంటే ఎందుకు ముందుకు వస్తుందంటూ పవన్ కల్యాణ్ నిలదీశారు. సమాజంలో నేరస్తులను వెనకేసుకొచ్చే నేతలను ప్రజలు పూర్తిగా పక్కన పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోని ప్రజాప్రతినిధుల తీరుపై కూడా డిప్యూటీ సీఎం అసహనం వ్యక్తం చేశారు. "ఇంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారు? సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై అన్నింటికీ నేనే మాట్లాడాలంటే ఎలా కుదురుతుంది? మీకు పౌరుషం లేదా?" అంటూ పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సుగాలి ప్రీతి కేసును ప్రస్తావిస్తూ.. ఆ కేసులో అన్ని సాక్ష్యాలను పథకం ప్రకారం ధ్వంసం చేశారని ఆరోపించారు. శాంతి భద్రతల విషయంలో తాము చాలా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించిన ఆయన.. "నేను హోంమంత్రిని కాకపోవడంతోనే ఇక్కడి క్రిమినల్స్ బతికి పోతున్నారు, ఒకవేళ నేనే హోంమంత్రిని అయి ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవి" అంటూ నేరగాళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

Next Story