నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసింది

by velandi.Saikiran |

శనివారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకుల సమీక్షా సమావేశం జరిగింది.

నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసింది
X

నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసింది..

-బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా, ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇబ్రాం శేఖర్ మాట్లాడుతూ.. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, నిరుద్యోగ భృతి వంటి హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, నిరుద్యోగులను విస్మరించారని విమర్శించారు. బహుజనులు, నిరుద్యోగులు, వివిధ వర్గాల ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన రేవంత్, ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు చేపట్టిన ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

Next Story