ధర్మశాల షాపులు ఖాళీ చేయించిన దేవదాయ శాఖ అధికారులు..

by Kodari Anjali |

మటికె నాగయ్య ధర్మశాల ట్రస్టుకు చెందిన షాపుల్లో ఏళ్ల తరబడి తిష్టవేసి, అద్దెలు చెల్లించకుండా కొనసాగుతున్న 5 షాపులను దేవదాయ శాఖ అధికారులు ఖాళీ చేయించారు.

ధర్మశాల షాపులు ఖాళీ చేయించిన దేవదాయ శాఖ అధికారులు..
X

దిశ, బేగంపేట: మటికె నాగయ్య ధర్మశాల ట్రస్టుకు చెందిన షాపుల్లో ఏళ్ల తరబడి తిష్టవేసి, అద్దెలు చెల్లించకుండా కొనసాగుతున్న 5 షాపులను దేవదాయ శాఖ అధికారులు ఖాళీ చేయించారు. మోండా మార్కెట్ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఉన్న మటిక నాగయ్య ధర్మశాలలో కొన్ని దశాబ్దాల నుంచి షాపులను ధర్మశాల నుంచి అద్దెకు తీసుకుని నడిపిస్తున్నారు. దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒక మారు టెండర్లు పిలిచి ఎక్కువ అద్దె చెల్లించి టెండర్ దక్కించుకున్న వాళ్లకు షాపులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలా ఏళ్ల నుంచి ఖాళీ చేయకపోవడంతో పాటు తక్కువ అద్దె ఉన్నా దాన్ని కూడా చెల్లించకుండా ట్రస్టు ఆదాయానికి గండి కొడుతున్నారు.

కోర్టు ఆదేశాలతో షాపులను..

ఇలా కొందరు రూ.15 లక్షల నుంచి రూ.20లక్షల వరకు అద్దె బకాయిలు ఉన్నారు. దీంతో ఫౌండర్ ఫ్యామిలీకి చెందిన ఎంఎన్ లింగప్పు, గౌరిశంకర్ లో దేవదాయ శాఖ ట్రిబునల్ లో కేసు వేసి కొద్ది సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. అయితే ఇటీవల కోర్టు ఎవిక్షన్ ఆర్డర్ ఇవ్వడంతో పోలీసు బందోబస్తు మధ్య దేవదాయ శాఖ సహాయ కమిషనర్ సంధ్యారాణి, ఇన్స్పెక్టర్ శ్రీదేవిలు 5 షాపులను ఖాళీ చేయించి సీజ్ చేశారు. కోర్టు ఆదేశాలతో షాపులను ఖాళీ చేయించడం పట్ల ఫౌండర్ ఫ్యామిలీ సభ్యులు మటికే గౌరిశంకర్, మటికె నాగేశ్వర్రావులు అధికారులకు ప్రత్యేక ధన్యవాదలు తెలిపారు. అలాగే మిగతా మూడు షాపులను త్వరలో ఖాళీ చేయించి అప్పగించాలని వారు కోరారు.

Next Story