రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మృతి

by velandi.Saikiran |

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రూరల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎ. నిరంజన్ రెడ్డి తెలిపారు.

రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మృతి
X

దిశ, కరీంనగర్ రూరల్: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రూరల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎ. నిరంజన్ రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామానికి చెందిన విలాసాగరం కరుణాకర్ (37) ఈ నెల 14 వ తేదీన కూలీలను మొగ్దుంపూర్ గ్రామం వద్ద దింపాడు. తిరిగి చామనపల్లి గ్రామానికి వెళ్తున్న క్రమంలో మొగ్దుంపూర్ రాజీవ్ రహదారిపై అతని వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కరుణాకర్ ను కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే శనివారం ఉదయం చికిత్స పొందుతూ కరుణాకర్ మృతి చెందినట్లు వైద్యులు సీఐ తెలిపారు. మృతుడి భార్య విలాసాగరం మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

విద్యుత్ తీగల ముఠా అరెస్ట్

విశ్వసనీయ సమాచారం ఆధారంగా నగునూరు, జూబ్లీనగర్ ప్రాంతాల్లో కరీంనగర్ రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ త‌రుణంలోనే అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా గత నెలలో చల్లబుత్కూర్ గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద రాయాన్ అనే వ్యక్తితో కలిసి అల్యూమినియం విద్యుత్ తీగలను దొంగిలించిన‌ట్లు తేలింది. ఈ క్ర‌మంలో ఓ ఆటోను స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి కోర్టులో ప్రవేశపెడతామ‌ని సీఐ నిరంజన్ రెడ్డి చెప్పారు.

Next Story