మూడో వన్డేలో జైస్వాల్, రోహిత్ ఊచకోత.. ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ ఘనవిజయం

by Malleboina Mahesh |

చెన్నై వన్డేలో ఆఫ్ఘనిస్తాన్‌పై 9 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం.. జైస్వాల్ (110*), రోహిత్ (79) విజృంభణతో వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్!

మూడో వన్డేలో జైస్వాల్, రోహిత్ ఊచకోత.. ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ ఘనవిజయం
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో భారత జట్టు భారీ విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. వెంట వెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టకు కెప్టెన్ హష్మతుల్లా ఆదుకొని సెంచరీ నమోదు చేసకున్నాడు. అలాగే అజ్మతుల్లా కూడా 50 పరుగులతో రాణించడంతో 44.2 ఓవర్లకు 218 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆలౌట్ అయింది. అనంతరం 219 పరుగుల స్వల్ప లక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత ఓపెనర్లు రెచ్చిపోయి ఆడారు.

ఐకానిక్ చెపాక్ మైదానంలో పరుగుల వరద పారిస్తూ భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. జైస్వాల్ సెంచరీతో నాటౌట్‌గా నిలవగా..రోహిత్ శర్మ 79 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చి శ్రేయస్ అయ్యర్ 20 పరుగులు చేశాడు. దీంతో భారత్ 28. 4 ఓవర్లలోను లక్ష్యాన్ని చేదించి.. ఆఫ్ఘనిస్తాన్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ (Clean Sweep) చేసి సిరీస్‌ను సొంతం చేసుకుంది.

Next Story