- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. CBSE క్లాస్ 12 రీ-ఇవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
సీబీఎస్‌ఈ (CBSE) క్లాస్ 12 రీ-ఇవాల్యుయేషన్, మార్కుల వెరిఫికేషన్ ఫలితాల విడుదల మొదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: క్లాస్ 12 రీ-ఇవాల్యుయేషన్ ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇవాళ విడుదల చేసింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత పారదర్శకంగా, నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు.
దశలవారీగా ఫలితాలు.. తొలి దశలో 87 శాతం పూర్తి
అయితే, ఏడాది రీ-ఇవాల్యుయేషన్, వెరిఫికేషన్ కోసం అందిన మొత్తం దరఖాస్తులలో దాదాపు 87 శాతానికి పైగా అప్లికేషన్లను బోర్డు సక్సెస్‌ఫుల్‌గా ప్రాసెస్ చేసి, వాటి ఫలితాలను మొదటి విడతలోనే విడుదల చేసింది. మిగిలిన విద్యార్థుల ఫలితాలను కూడా త్వరలోనే దశలవారీగా విడుదల చేయనున్నట్లుగా సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. మార్పులు జరిగిన విద్యార్థుల అప్‌డేటెడ్ డిజిటల్ మార్క్‌షీట్లను నేరుగా డిజిలాకర్‌లో అందుబాటులో ఉంచారు. ఫలితాలను చెక్ చేసుకునేందుకు విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ results.digilocker.gov.inను సందర్శించాలని సీబీఎస్‌ఈ బోర్డు అధికారులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఫలితాల గురించి వచ్చే తప్పుడు వార్తలు, పుకార్లను నమ్మవద్దని విద్యార్థులకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఫలితాలకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే అధికారిక వెబ్‌సైట్, రీజినల్ ఆఫీసులను సంప్రదించి సరైన సమాచారం తెలుసుకోవాలని పేర్కొన్నారు.
కాగా, సీబీఎస్ఈ (CBSE) క్లాస్ 12 ఫలితాల ప్రకటన తర్వాత కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) మూల్యాంకన విధానంలో తలెత్తిన సాంకేతిక లోపాలు, మార్కుల్లో భారీ వ్యత్యాసాల కారణంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. మే 13న ఫలితాలను విడుదల చేయగా, ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోలిస్తే 88.39 శాతం నుంచి 85.20 శాతానికి పడిపోయింది. దీంతో వేలాది మంది విద్యార్థులు తమకు ఊహించిన దానికంటే చాలా తక్కువ మార్కులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల తీవ్ర నిరసనల అనంతరం.. సీబీఎస్ఈ రీవాల్యుయేషన్, వెరిఫికేషన్ ఫలితాలను దశలవారీగా విడుదల చేయడం ప్రారంభించింది.






