ప్రేయసి దూరం కావడంతో యువకుడి ఆత్మహత్య

by Batti.Sumithra |   (  Updated:2026-06-22 09:54:31  IST  )

మండల పరిధిలోని ఆకుపాముల గ్రామానికి చెందిన సట్టు కోటేశ్వరరావు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ ముస్లిం యువతిని ప్రేమించి ఇటీవల వివాహం చేసుకున్నాడు.

ప్రేయసి దూరం కావడంతో యువకుడి ఆత్మహత్య
X

దిశ, మునగాల : మండల పరిధిలోని ఆకుపాముల గ్రామానికి చెందిన సట్టు కోటేశ్వరరావు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ ముస్లిం యువతిని ప్రేమించి ఇటీవల వివాహం చేసుకున్నాడు. అయితే, వారి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులు అంగీకరించకపోవడంతో ఆ ప్రేమ జంట ఇల్లు విడిచి వెళ్లి వేరొకచోట తలదాచుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం యువతి కుటుంబ సభ్యులు వారి ఆచూకీ తెలుసుకొని తమ కుమార్తెను తమ వెంట తీసుకెళ్లారు. దీంతో తాను ప్రేమించి వివాహం చేసుకున్న భార్య దూరం కావడం, ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా కోటేశ్వరరావు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story